మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. పాల్ఘర్ అడవుల్లో వేటాడుతుండగా కొంతమంది గ్రామస్తులు తమ సొంత సహచరులలో ఒకరిని అడవి పంది అని పొరపాటున కాల్చి చంపారు. ఈ కాల్పుల్లో ఆ వ్యక్తి మరణించాడని, మరొకరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జనవరి 28 రాత్రి జరిగిన ఈ సంఘటనలో గాయపడిన వ్యక్తి కూడా చికిత్స పొందుతూ మరణించాడు. ఈ కేసులో పోలీసులు 6 మందిని అరెస్టు చేశారు.
పాల్ఘర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొంతమంది గ్రామస్తులు అడవి పందులను వేటాడేందుకు జిల్లాలోని మనర్‌లోని బోర్షెటి అడవుల్లోకి వెళ్లారు. అడవి పందుల కోసం వేటసాగిస్తుండగా, కొంతమంది గ్రామస్తులు తమ తోటి వారి నుండి విడిపోయారు. కొంత సమయం తరువాత గ్రామస్తులలో ఒకరు తమ నుంచి విడిపోయిన సహచరులను పొరపాటుగా అడవి పందులుగా భావించారు. భయంతో వెంటనే కాల్పులు జరిపారు. దీనిలో ఇద్దరు గ్రామస్తులు గాయపడ్డారు. వారిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా , మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదవశాత్తు జరిగిన హత్యతో భయపడిన గ్రామస్తులు సంఘటన గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడానికి బదులుగా మృతుడి మృతదేహాన్ని పొదల్లో దాచిపెట్టారని SDPO తెలిపారు.
‘సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, నేరంలో ప్రమేయం ఉందనే అనుమానంతో ఆరుగురు గ్రామస్తులను అదుపులోకి తీసుకున్నట్టుగా అధికారి తెలిపారు. పోలీసుల సెర్చ్ ఆపరేషన్ అనంతరం.. అధికారులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరణానికి ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించడానికి పోస్ట్‌మార్టం కోసం పంపారు. గాయపడిన గ్రామస్తుడు కూడా చికిత్స సమయంలో మరణించాడని, అధికారులకు తెలియజేయకుండానే దహనం చేశాడని దర్శివ్కర్ తెలిపారు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తున్నట్లు అధికారి తెలిపారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..