భార్యాభర్తల పడకగది ఇంటి నైరుతి మూలలో ఉండటం శుభప్రదం. ఇది మనస్తత్వ పరంగా స్థిరత్వాన్ని కలిగిస్తుంది. గదిలో లేత నీలం, పీచ్, పింక్ వంటి రంగులను ఉపయోగించడం శాంతి, ప్రేమను పెంచుతుందని నమ్ముతారు. అలాగే గదిలో గందరగోళం లేకుండా క్రమం తప్పకుండా శుభ్రం చేయడం ఎంతో అవసరం. పూలను అలంకరించడం ద్వారా సౌందర్యం పెరిగి ప్రేమాభిమానాలు మరింత పెరుగుతాయట.
మంచం ఉనికి, వాస్తు ప్రకారం ఏర్పాటు.. మంచం గది నైరుతి మూలలో ఉండాలి. మంచం తలుపు ఎదురుగా లేకుండా చూడాలి. తల భాగం దక్షిణం లేదా తూర్పు వైపు ఉండేలా ఏర్పాటు చేయడం మంచిది. ఇది మంచి నిద్రను కలిగించి దంపతుల మధ్య పరస్పర అనుబంధాన్ని పెంచుతుంది. అలాగే మంచం కింద అనవసర వస్తువులు ఉంచకపోవడం ఉత్తమం.
గృహ అలంకరణ, పడక గదిలో జతగా ఉండే పక్షుల చిత్రాలు లేదా శృంగార భావాన్ని పెంచే కళాకృతులు ఉంచడం మంచిది. రాధా-కృష్ణుడి విగ్రహాన్ని లేదా పెయింటింగ్‌ను గది నైరుతి మూలలో ఉంచడం అనుకూలంగా ఉంటుంది. విబేధాలు, తగాదాలకు కారణమయ్యే చిత్రాలను గదిలో ఉంచడం మంచిది కాదు. అలాగే గది శుభ్రంగా, పరిశుభ్రంగా ఉండేలా చూడాలి.
గదిలో తగినంత వెలుతురు, గాలి ప్రసారం ఉండేలా చూడాలి. మంచి వెంటిలేషన్ ఉండడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ప్రవాహం ఉంటుంది. భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశం అనే ఐదు మూలకాలను సమతుల్యం చేసేలా గదిని ఉంచడం శ్రేయస్కరం. అలాగే గదిలో స్వచ్ఛమైన గాలి కోసం ఏదైనా చిన్న గ్రీన్ ప్లాంట్ పెట్టడం మంచిది.
రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్‌ను పడక గదిలో ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. ఇది భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలను పెంచుతుంది. అలాగే దంపతుల మధ్య అనుబంధాన్ని మరింత బలపరుస్తుంది. వాస్తు ప్రకారం రోజ్ క్వార్ట్జ్ ఎమోషనల్ బాండింగ్‌ను ఇంప్రూవ్ చేసి, పాజిటివ్ ఎనర్జీ ప్రవాహాన్ని పెంచుతుందని నమ్ముతారు. కాబట్టి ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సంబంధాల్లో కొత్త అనుభూతిని పొందొచ్చు.