ఈ స్టార్ క్రికెటర్ వయసు 40 సంవత్సరాలు. ఈ వయస్సు కారణంగానే ఈ సంవత్సరం ఐపీఎల్ వేలానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ అతనిని రిటైన్ చేసుకోలేదు. ఐపీఎల్ మెగా వేలంలోనూ ఈ సీనియర్ ప్లేయర్ ను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ పెద్దగా ఆసక్తి చూపలేదు. చివరకు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ రూ.2 కోట్ల బేస్ ప్రైస్ చెల్లించి ఈ స్టార్ ప్లేయర్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు, అదే 40 ఏళ్ల క్రికెటర్ ఒక యువకుడిలా ఫీల్డింగ్ చేస్తున్నాడు. పక్షిలా గాల్లోకి ఎగిరి అద్భుతమైన ఫ్లయింగ్ క్యాచ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతనే దక్షిణాఫ్రికా సీనియర్ ప్లేయర్ ఫాఫ్ డుప్లెసిస్. సెంచూరియన్‌లోని స్పోర్ట్‌పార్క్ గ్రౌండ్‌లో జరిగిన దక్షిణాఫ్రికా T20 లీగ్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఫాఫ్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
ఈ మ్యాచ్‌లో జోబర్గ్ సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీని ప్రకారం, మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ ఈస్ట్రన్ కేప్ జట్టుకు డేవిడ్ బెడింగ్ హామ్ (27) మంచి ఆరంభాన్ని అందించాడు. కానీ ఇమ్రాన్ తాహిర్ వేసిన 5వ ఓవర్ మొదటి బంతికి బెడ్డింగ్‌హామ్ దానిని మిడ్-ఆఫ్ వైపు కొట్టాడు. బంతి 30 యార్డ్ సర్కిట్ దాటబోతుండగా, ఫాఫ్ డు ప్లెసిస్ అమాంతం అందుకున్నాడు. పక్షిలా గాల్లోకి ఎగిరి దూకుతూ అద్భుతమైన క్యాచ్ పట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తద్వారా ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్ మరోసారి నిరూపించాడీ సీనియర క్రికెటర్. ఇప్పుడు, ఫాఫ్ డు ప్లెసిస్ అద్భుతమైన క్యాచ్ కు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ దక్షిణాఫ్రికా క్రికెటర్ ఫీల్డింగ్ ప్రశంసలు అందుకుంటోంది.
ఇవి కూడా చదవండి
డుప్లెసిస్ మెరుపు క్యాచ్.. వీడియో ఇదిగో..
FAF DU PLESSIS IS RIDICULOUS AT THIS POINT – 40 YEARS OLD. 🤯🔥#Avisha#GrandeFratello #StarAcademyLeLive #LingOrm #DailynewsAwards2024 #WinterAhead #จุงดัง #BamBam #IRENE #AIart #DailynewsAwards2024xLMSY pic.twitter.com/eIl2YW3tRV
— Cricket person 🧢 (@I_am_Unkar007) February 6, 2025
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జోబర్గ్ సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 32 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..