మధ్యప్రదేశ్‌లో దుండగులు రెచ్చిపోయారు. పోలీసులను సైతం వదిలిపెట్టడం లేదు. ఇండోర్ నుండి ఇలాంటిదే మరొక కేసు వెలుగులోకి వచ్చింది. అక్కడ దుండగులు ఒక పోలీసు సబ్-ఇన్స్పెక్టర్‌ను కిడ్నాప్ చేసి దారుణంగా కొట్టారు. కొట్టే వీడియో కూడా బయటపడింది. నలుగురు యువకులు SI ని తీవ్రంగా కొడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారులో మద్యం సేవిస్తున్న నిందితులను సబ్-ఇన్‌స్పెక్టర్ ఆపాడు. దీంతో ఆగ్రహించిన నిందితులు అతడిపై దాడికి తెగబడ్డారు.
ఇండోర్‌లోని బన్‌గంగా పోలీస్ స్టేషన్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్ తెరేశ్వర్ ఇక్కాపై నలుగురు యువకులు దారుణంగా దాడి చేశారు. నిందితులైన యువకులు కారులో కూర్చుని మద్యం సేవిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సబ్-ఇన్‌స్పెక్టర్ అతన్ని మద్యం తాగకుండా ఆపాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన దుండగులు సబ్-ఇన్‌స్పెక్టర్‌ను బలవంతంగా థార్ కారులో నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత మొదట సబ్-ఇన్‌స్పెక్టర్‌ను తీవ్రంగా కొట్టారు. ఒక వీడియో చేసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ సంఘటన తర్వాత, SI తెరేశ్వర్ ఇక్కా నిందితులపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసు అధికారికి వైద్య పరీక్షలు నిర్వహించి, తరువాత థార్ వాహనం నంబర్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ కేసులో చర్యలు తీసుకున్న పోలీసులు, జోబాట్ జైలులో ఉన్న జైలు గార్డుతో సహా ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. వారిని అరెస్టు చేయడానికి ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. తనను కొట్టిన సమయంలో వైర్‌లెస్ ద్వారా సహాయం కోరానని, కానీ ఎవరూ తనకు సహాయం చేయలేదని SI తెరేశ్వర్ ఇక్కా తెలిపారు. మొత్తం సంఘటనకు సంబంధించిన వీడియో కూడా బయటపడింది.
వీడియో చూడండి..
इंदौर का ये वीडियो सोशल मीडिया पर खूब वायरल हो रहा है जिसमें एक दारोगा का ड्यूटी के दौरान अपहरण और फिर पिटाई ,इंदौर में सड़क पर शराब पी रहे लड़को को चौकी इंचार्ज ने टोका तो चौकी इंचार्ज को उठा ले गए लड़के और अनजान जगह ले जाकर पीटा pic.twitter.com/LKxLvUcT9e
— Anuj chaudhary ..Newsपोस्ट (@anuj8sahara) February 6, 2025
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..