ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లాడు డ్రైవర్. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కారులో డ్రైవర్‌తో తన భార్య కలిసి ఉండడాన్ని చూడడమే ఆ వ్యక్తి చేసిన పాపం అయిపోయింది. వెంటనే ఆ కారును ఆపేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో కారు బానెట్ పై పడ్డాడు. అయినా కారు ఆపకుండా ఆ డ్రైవర్ అలాగో ముందుకు ఈడ్చుకెళ్లాడు.
ఇది చదవండి: కమ్మటి సమోసాలో మెరుస్తూ కనిపించింది.. ఏంటా అని చూడగా.. అమ్మబాబోయ్.!
ఇవి కూడా చదవండి
సమీర్ అనే వ్యక్తి తన భార్య.. మహీర్ అనే వ్యక్తితో కారులో ఉండడాన్ని చూశాడు. వెంటనే తన బైక్‌తో ఆ కారును అడ్డుకుని ఆపడానికి ప్రయత్నించాడు. మహీర్ తన కారును ఆపకుండా అలాగే పోనిచ్చాడు. దీంతో కారు బానెట్‌పై సమీర్ పడ్డాడు. బానెట్‌ను పట్టుకుని వేలాడుతున్న అతడిని అలాగే కొంతదూరం వరకు ఈడ్చుకెళ్లాడు. పలువురు వాహనదారులు గమనించి, కారును ఆపమని హెచ్చరించారు. అయినా వినకపోవడంతో వెంబడించి కారును అడ్డుకున్నారు.
ఇది చదవండి: కలలో చనిపోయిన వ్యక్తులు కనిపిస్తే దాని అర్ధం ఏంటో తెల్సా
అనంతరం మహీర్‌తో సమీర్ ఘర్షణకు దిగాడు. కారు బానెట్‌పై తనను ఈడ్చుకెళ్లడంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మహీర్‌ను అరెస్ట్ చేశారు. అతడి కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశామన్నారు పోలీసులు. మరోవైపు కొందరు వాహనదారులు రికార్డ్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది చదవండి: రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.? అందాలతో గత్తరలేపుతోందిగా
मुरादाबाद में पत्नी को प्रेमी के साथ देख पति ने गाड़ी रोकने की कोशिश की लेकिन प्रेमी पति को गाड़ी के बोनट पर पति को घसीटता रहा !
मेहर काली मिले मगर छि &नार ना मिले!pic.twitter.com/7bHwNb11DG
— Anurag Singh (@anuragxind) January 17, 2025
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి