ప్రస్తుత కాలంలో గుండె జబ్బుల కేసులు భారీగా పెరుగుతున్నాయి.. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ గుండె జబ్బులతోపాటు గుండె పోటు బారిన పడుతున్నాయి.. ఇలా పరిస్థితుల్లో గుండె ఆరోగ్యంగా ఉండేందు మనం ఇప్పటినుంచే చర్యలు తీసుకోవాలి. వాస్తవానికి మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో గుండె ఒకటి. ఇది శరీరమంతా రక్తాన్ని పంప్ చేస్తుంది. కానీ నేటి కాలంలో చాలా మందికి గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయి. దీనికి కారణం మన చెడు జీవనశైలి.. వృద్ధులతో పాటు యువతలో కూడా గుండెపోటు ప్రమాదం పెరుగుతోంది. అటువంటి పరిస్థితిలో.. ఎలాంటి రోజువారీ తప్పులు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయో తెలుసుకోవడం ముఖ్యం.. గుండె సంబంధిత సమస్యలు నివారించేందుకు ఎలాంటి చెడు అలవాట్లను వదిలియాలి..? గుండె సంరక్షణ కోసం నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి..
గురుగ్రామ్‌లోని మారింగో ఆసియా హాస్పిటల్ కార్డియాలజీ విభాగం చైర్మన్ డాక్టర్ సంజీవ్ చౌదరి గుండె సంబంధిత సమస్యల గురించి పలు విషయాలను పంచుకున్నారు. చాలా సార్లు మన తప్పుడు అలవాట్లు గుండెను బలహీనపరుస్తాయన్నారు. చెడు జీవనశైలి, వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి, అధిక చక్కెర ఆహారం గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయన్నారు.
రోజూవారి జీవితంలో ఎలాంటి అలవాట్లను మార్చుకోవాలి..? గుండె కార్డియాలజీ విభాగం నిపుణులు ఏం చెబుతున్నారు.. ఎలాంటి సూచనలు ఇస్తున్నారు..? ఇలాంటి వివిషయాలను తెలుసుకోండి..
ధుమపానం..
సిగరెట్లు, బీడీలు గుండెకు చాలా హానికరం. సిగరెట్ పొగ కూడా మీ గుండెకు హాని కలిగిస్తుంది. ధూమపానం రక్తాన్ని చిక్కగా చేస్తుంది. దీని కారణంగా, ధమనులలో రక్తం గడ్డకట్టడం ప్రారంభమవుతుంది.. గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. మీరు మీ గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటే, వెంటనే ధూమపానం మానేయండి.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయకపోవడం..
నేటి బిజీ జీవనశైలిలో, చాలా మంది శారీరక శ్రమపై శ్రద్ధ చూపరు. కానీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. ప్రతిరోజూ కనీసం 30-45 నిమిషాలు నడవడం లేదా తేలికపాటి వ్యాయామం చేయడం గుండెకు మేలు చేస్తుంది. వ్యాయామం చేయని వారికి ఊబకాయం, అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
గుండె పరీక్ష చేయించుకోకపోవడం
తరచుగా ప్రజలు పెద్ద సమస్య వచ్చే వరకు డాక్టర్ వద్దకు వెళ్లరు. కానీ గుండెకు సంబంధించిన ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఎటువంటి లక్షణాలు లేకుండా కూడా గుండె సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి, 30 సంవత్సరాల వయస్సు తర్వాత, క్రమం తప్పకుండా గుండె పరీక్ష చేయించుకోవాలి. రక్తపోటు, కొలెస్ట్రాల్, చక్కెరను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవడం వల్ల గుండె జబ్బులను నివారించవచ్చు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..