ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల నిర్వాకం పదే పదే ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది. సర్కార్ జీతం తీసుకుంటున్న కొందరు వైద్యులు ప్రజల ప్రాణాలు కాపాడాల్సింది పోయి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా సర్కార్ దవాఖానా నర్స్ చేసిన పని ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. తీవ్రమైన గాయాలతో బాధపడుతున్న ఏడేళ్ల చిన్నారిని చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకువచ్చారు. కానీ అక్కడి నర్సు చేసిన పనికి అధికారులు ఆమెను సస్పెండ్ చేశారు. ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే..
కర్ణాటకలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన ఏడేళ్ల బాలుడి చెంపపై గాయమై కుట్లు వేయాల్సి వచ్చింది. కానీ హాస్పిటల్ నర్సు నిర్లక్ష్యంగా కుట్లు వేయడానికి బదులుగా అతని గాయంపై ఫెవికోల్ వేసింది. అయితే ఈ తప్పుకు ఆసుపత్రి ఆ నర్సును సస్పెండ్ చేసింది. ఈ సంఘటన బుధవారం అంటే ఫిబ్రవరి 5న జరిగింది. కాగా సోషల్ మీడియాలో వార్త దావానంలా వ్యాపించింది.
ఇవి కూడా చదవండి
A shocking incidental astatine Adoor Primary Health Center successful #Karnataka’s Haveri territory has raised concerns implicit healthcare quality. On January 14, Nurse Jyoti utilized Feviquick adhesive alternatively of stitches to dainty a heavy coiled connected a 7-year-old boy’s cheek. The boy, Gurukishan Annappa… pic.twitter.com/a9nsPudzVO
— South First (@TheSouthfirst) February 4, 2025
గురుకిషన్ అన్నప్ప హోసమణి అనే 7 ఏళ్ల బాలుడి ముఖం మీద లోతైన గాయం అయింది. దాంతో అతన్ని చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకువచ్చారు. గాయం చాలా లోతుగా ఉండటం వల్ల కుట్లు వేయాల్సి వచ్చింది. కానీ, నర్సు ఫెవికాల్ వేసింది. సదరు నర్స్ చేసిన పనిని ఆ చిన్నారి తల్లిదండ్రులు వీడియో తీశారు. అనంతరం సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన నర్స్ పేరు జ్యోతి అని చెప్పారు. అయితే, ఆ చిన్నారి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జ్యోతి అనే ఈ నర్సు చేసిన పనిపట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి అధికారులు ఆమెను ఆసుపత్రి నుండి సస్పెండ్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..