చేనేత చీరలంటే మక్కువ చూపించే నిర్మలమ్మ ఈసారి కూడా హ్యాండ్లూమ్ శారీనే ఎంచుకున్నారు. ఆమె బంగారు అంచుతో ఉన్న గోధుమవర్ణం చీర, ఎరుపు రంగు బ్లౌజ్, ఒక శాలువాతో కనిపించారు. దీనిపై ఉన్న చేపల ఆర్ట్ ఆకట్టుకుంది.దీనిని పద్మశ్రీ అవార్డు గ్రహీత దులారీదేవి.. మంత్రికి కానుకగా ఇచ్చారు. సీతారామన్ ఓ కార్యక్రమం నిమిత్తం బిహార్‌లోని మధుబనికి వెళ్లినప్పుడు ఆమెను కలిసి ముచ్చటించారు. ఆ సమయంలో కళాకారిణి అయిన దులారీ తాను డిజైన్ చేసిన ఈ చేనేత చీరను ఆర్థికమంత్రికి బహూకరించారు. బడ్జెట్ వేళ దీనిని ధరించాలని కోరారు. ఆమెకు ఇచ్చిన మాట ప్రకారమే కేంద్ర మంత్రి ఈ చీరను ధరించినట్లు తెలుస్తోంది. మదుబని ఆర్ట్‌తో ఎన్నో పెయింటింగ్స్ వేసిన దులారీ దేవిని కేంద్రం 2021లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
మరిన్ని వీడియోల కోసం :
పెళ్లికి వేళాయరా.. మంచి ముహుర్తాలు వచ్చేశాయ్!
రైల్వే ట్రాక్‌పై కూర్చొని ఫోన్‌లో మాట్లాడుతున్న యువకుడు.. ఇంతలో.. వీడియో