ఒకప్పుడు బాలీవుడ్ సినీ ప్రపంచంలో ఆమె ఫేమస్. ముఖ్యంగా అప్పట్లో రొమాంటిక్ చిత్రాలు, సాంగ్స్‌లో ఒక్కసారిగా సంచలనంగా మారింది. దీంతో పాన్ ఇండియా లెవల్లో ఆమె పేరు మారుమోగింది. కుటుంబం వ్యతిరేకించినప్పటికీ నటనపై ఆసక్తితో సినిమాల్లోకి వచ్చింది. విభిన్న కథా చిత్రాల్లో నటించి బీటౌన్ లో బోల్డ్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది. నార్త్ నుంచి సౌత్ వరకు అప్పట్లో ఆమె కుర్రాళ్ల ఫేవరేట్. కానీ తన 22 ఏళ్ల కెరీర్ లో కేవలం 2 హిట్స్ మాత్రమే అందుకుంది. అయినప్పటికీ ఆమె ఆస్తులు వివరాలు తెలిస్తే మైండ్ బ్లాంకే. ప్రస్తుతం ఆమె క్రేజ్ తగ్గిపోయింది. ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఇంతకీ ఆమె ఎవరంటే.. బాలీవుడ్ బ్యూటీ మల్లికా షెరావత్.
సినిమాల్లోకి వెళ్తానని చెప్పగానే తల్లిదండ్రులు వద్దన్నారు. దీంతో ఫ్యామిలీని వదిలి ముంబై చేరుకుంది. ఎన్నో కష్టాలను, సవాళ్లను ఎదుర్కొని అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగింది. మల్లికా షెరావత్… అసలు పేరు రీమా లాంబా. ‘జీనా సిర్ఫ్ మేరే లియే’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత 2004లో వచ్చిన మర్డర్ మూవీతో మరింత పాపులర్ అయ్యింది. రూ.5 కోట్లతో నిర్మించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.22.50 కోట్లు వసూలు చేసింది. దీంతో ఈ బ్యూటీకి స్టార్ డమ్ వచ్చేసింది. ఆ తర్వాత వెల్ కమ్ మూవీతో మరో హిట్ అందుకుంది.
ఇవి కూడా చదవండి
దాదాపు రెండు దశాబ్దాల్లో ఎన్నో సినిమాల్లో నటించింది. అప్పట్లో మల్లికా ఎక్కువగా రొమాంటిక్ కంటెంట్ చిత్రాల్లోనే నటించి పాపులర్ అయ్యింది. కానీ 22 ఏళ్ల సినీప్రయాణంలో కేవలం రెండు సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. ప్రస్తుతం మల్లికా ఆస్తులు రూ.174 కోట్లు అని సమాచారం. చివరిసారిగా విద్యా కా వో వాలా వీడియోలో కనిపించారు. ఈ సినిమా సైతం అంతగా విజయం సాధించలేకపోయింది.
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన