ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్ధులకు పబ్లిక్ పరీక్షలు యథావిధిగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి సిలబస్ అమలు, పరీక్షల నిర్వహణ, అంతర్గత మార్కుల విధానం లాంటి పలు ప్రతిపాదనలను ఇటీవల ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రకటించింది. ఇందులో ప్రధానంగా ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయించింది.
అయితే ఈ ప్రతిపాదనపై వివిధ వర్గాల నుండి విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ ప్రతిపాదనలపై ఈ నెల 26 వరకు సలహాలు, సూచనలు స్వీకరించింది. ఇంటర్మీడియట్ విద్యలో ప్రతిపాదిత సంస్కరణలపై వచ్చిన సూచనల మేరకు ప్రభుత్వం ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షను యథావిథిగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఫస్ట్ ఇంటర్ పరీక్షలు నిర్వహించకపోతే విద్యార్ధులు చదువుపై దృష్టి పెట్టరని, దీంతో అభ్యాసన సామర్థ్యాలు తగ్గిపోతాయని.. ఇలా పలు సూచనలు వచ్చాయి. దీంతో అంతర్గత మార్కుల విధానం ప్రతిపాదనలను ఇంటర్ బోర్డు .