డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన సినిమా లైగర్. ఈ సినిమా విడుదలకు ముందు ఎన్నో అంచనాలను క్రియేట్ చేసింది. విజయ్ సిక్స్ ప్యాక్, అలాగే డిఫరెంట్ లుక్ తో కనిపించి ఆశ్చర్యపరిచాడు. అలాగే సినిమా బాక్సింగ్ నేపథ్యం అనగానే సినిమా పై ఆసక్తి నెలకొంది ప్రేక్షకుల్లో.. అంతే కాదు సినిమాకు ముందు ప్రమోషన్స్ కూడా అదే రేంజ్ లో చేశారు. సినిమ ఇండియాను షేక్ చేస్తుదంటూ ప్రమోషన్స్ అదరగొట్టారు. కానీ సినిమా విడుదల తర్వాత సీన్ రివర్స్ అయ్యింది. ఊహించని విధంగా లైగర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొటింది. లైగర్ సినిమా ప్రేక్షకులను దారుణంగా నిరాశపరిచింది.
ఇది కూడా చదవండి : క్రికెటర్‌తో ఎఫైర్.. ఫ్రెండ్ భర్తతో ఆ యవ్వారం.. పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్.. ఎవరో తెలుసా.?
లైగర్ సినిమా కథ పరంగా ఓకే అనిపించినా కూడా ప్రేక్షకులకు మాత్రం కనెక్ట్ అవ్వలేదు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. అలాగే ఈ సినిమాలో మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించాడు. వీరితోపాటు రమ్యకృష్ణ, అలీ, చుంకీ పాండే కూడా నటించారు. అయితే లైగర్ సినిమా గురించి హీరోయిన్ అనన్య పాండే తండ్రి చుంకీ పాండే షాకింగ్ కామెంట్స్ చేశారు. లైగర్ సినిమా చేయడం అనన్యకు ఇష్టం లేదు అని అన్నారు చుంకీ పాండే..
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి :ఆ హీరో ఎందుకూ పనికిరాడని వాళ్ల నాన్న తెగ బాధపడ్డాడు.. ఇంతకీ అతను ఎవరంటే
తాజాగా చుంకీ పాండే మాట్లాడుతూ.. లైగర్ సినిమాను అనన్య ఇష్టం లేకుండానే ఒప్పుకుందని అన్నారు. లైగర్ సినిమా ఛాన్స్ వచ్చినప్పుడు అనన్య చాలా ఆలోచించింది. ఆ సినిమాలో హీరోయిన్ రోల్ కు సెట్ అవ్వను అని భావించింది. మరీ చిన్న పిల్లల కనిపిస్తాను అని తెగ ఫీల్ అయ్యింది. నా దగ్గరకు వచ్చి ఆ విషయం చెప్పింది. ” నాన్న ఈ సినిమాకు నేను సెట్ కాను అనిపిస్తుంది. ఏం చేయమంటావ్.? అని నన్ను అడిగింది. దానికి నేను అది పెద్ద సినిమా.. సక్సెస్ అయితే మంచి క్రేజ్ వస్తుందని చెప్పి ఒప్పించా.. దాంతో అనన్య అసౌకర్యంగానే సినిమాకు ఓకే చెప్పింది. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ చూసి అనన్య చెప్పింది నిజమే అని అర్ధమైంది అని చెప్పుకొచ్చారు చుంకీ పాండే.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి