ప్రస్తుత కాలంలో చాలామంది ఊబకాయం (అధిక బరువు) సమస్యతో బాధపడుతున్నారు.. అన్ని ప్రమాదకర జబ్బులకు స్థూలకాయమే చాలావరకు కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. మనలో చాలామంది పెరుగుతున్న బరువును తగ్గించుకోవడానికి చాలా కష్టపడుతున్నారు.. జిమ్‌లలో చెమటోడ్చటం.. వ్యాయామం, డైటింగ్ లాంటివి పాటిస్తున్నారు.. అయితే.. అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, ఆశించిన ఫలితం సాధించడం లేదు.. అటువంటి పరిస్థితిలో మీరు వ్యాయామంతో పాటు అవిసెగింజలు (ఫ్లాక్స్ సీడ్స్) తీసుకుంటే మంచిదని, బరువు తగ్గొచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.. ఈ అవిసెగింజలు.. పొట్ట, నడుము చుట్టూ ఉన్న కొవ్వును తగ్గిస్తుంది.
ఫ్లాక్స్ సీడ్స్ సహాయంతో బరువు తగ్గడమే కాకుండా శరీరంలో ఉండే అనేక ఇతర సమస్యలను కూడా నయం చేయవచ్చని ప్రముఖ డైటీషియన్లు చెబుతున్నారు. అవిసెగింజలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకోండి..
అవిసె గింజలలో ఎన్నో పోషకాలు..
అవిసె గింజలలో చాలా చిన్నవిగా అనిపించవచ్చు.. కానీ అవి ఏ సూపర్‌ఫుడ్ కంటే తక్కువ కాదు. ఇవి మన శరీర అభివృద్ధికి కూడా అవసరం. శరీరానికి అన్ని విధాలా మేలు చేసే ఈ గింజల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిలో ఫైబర్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఆరోగ్యకరమైన ప్రోటీన్లు, ఫినాలిక్ సమ్మేళనాలు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. రోజువారీ జీవితంలో అవిసె గింజలను చేర్చుకోవడం వల్ల ఈ పోషకాలన్నీ పొందవచ్చు..
అవిసె గింజలు బరువును ఎలా తగ్గిస్తాయి?
అవిసె గింజలు అనేక వ్యాధులలో, పలు సమస్యలతో పోరాడటంలో సహాయపడతాయి.. కానీ మీరు మీ పెరుగుతున్న బరువును తగ్గాలని ఆలోచిస్తున్నట్లయితే, అవి మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వీటి కారణంగా, పొట్ట, నడుము చుట్టూ ఉన్న కొవ్వు తగ్గడం ప్రారంభమవుతుంది.. ఎందుకంటే అవిసెగింజలలోని పోషకాలు అదనపు కొవ్వును కరిగించడంలో శక్తివంతంగా పోరాడి.. బరువు తగ్గించేలా సహాయపడతాయి.
వాస్తవానికి అవిసె గింజలు తినడం వల్ల మనం.. ఆకలి బాధలను నియంత్రించడం ప్రారంభిస్తాము. మనం తక్కువ ఆహారం తీసుకుంటే బరువు కూడా తగ్గడం ప్రారంభమవుతుంది. ఈ విత్తనాల వల్ల శరీరంలో మంట తగ్గడంతోపాటు జీర్ణక్రియ మెరుగుపడుతుంది.. దీని కారణంగా బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.
అవిసె గింజలను ఎలా తీసుకోవాలి..
మీరు అవిసె గింజలను పాలు, ఆపిల్ స్మూతీతో కలిపి తీసుకోవచ్చు.. వేయించి లేదా పచ్చిగా కూడా తినవచ్చు.. వేడి నీటిలో కూడా అవిసెగింజల పొడిని కలుపుకుని తాగవచ్చు.. ఇలా చేయడం వల్ల కొన్ని వారాల్లోనే మీ బరువు తగ్గడం ప్రారంభమవుతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..