100కు మించిన వేగంతో లారీని ఢీకొట్టిన కారు.. ఏడుగురు మృతి.. ఆ భయానక దృశ్యాలు..

2 hours ago 1

గుజ‌రాత్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. స‌బ‌ర్‌కాంతా జిల్లాలోని హిమ్మ‌త్ న‌గ‌ర్ వ‌ద్ద కారు, లారీ ఢీకొన్నాయి. దీంతో కారులో ప్ర‌యాణిస్తున్న ఏడుగురు వ్య‌క్తులు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వెనుక నుంచి ఓ కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతి చెందారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మరణించిన వ్యక్తులు ఒకే కుటుంబానికి చెందినవారిగా తెలిసింది.

ఈ వీడియో చూడండి..

ఇవి కూడా చదవండి

VIDEO | Gujarat: At slightest 7 radical were killed successful a car-trailer collision successful Himmatnagar earlier today. More details are awaited.

(Full video disposable connected PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/AHFD24fJl2

— Press Trust of India (@PTI_News) September 25, 2024

సబర్‌కాంత ఎస్పీ విజయ్ పటేల్‌ మాట్లాడుతూ.. ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం స‌మీప ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్ర‌మాదానికి అతి వేగ‌మే కార‌ణ‌మ‌ని పోలీసులు నిర్ధారించారు. ట్రక్కును వెనుక నుండి ఢీకొనడంతో కారు ముందు నుండి బాగా నుజ్జునుజ్జు అయ్యిందని చెప్పారు. దీంతో కారుపార్ట్‌ కట్టర్‌తో కోసి మృతదేహాలను బయటకు తీశారు. కారు వేగం గంటకు 100 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉందని అంటున్నారు. అందుకే ప్రమాదం ఇంత తీవ్రంగా ఉందని చెప్పారు.

ఈ వీడియో చూడండి..

#WATCH | Sabarkantha, Gujarat | A car collided with a dense conveyance successful Himmatnagar. The constabulary and occurrence section contiguous astatine the spot. Injuries and casualties feared. More details awaited. pic.twitter.com/kHGz5tkl30

— ANI (@ANI) September 25, 2024

ఈ ప్రమాదంపై దారిన వెళ్లేవారు పోలీసులకు సమాచారం అందించారు. సబర్‌కాంత పోలీస్‌స్టేషన్‌ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. కారు పూర్తిగా ధ్వంసంమైంది. కారు శ్యామ‌ల‌జీ నుంచి అహ్మ‌దాబాద్ వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. మృతుల నివాసాల్లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article