అనసూయ భరధ్వాజ్.. ఈ పేరు రెగ్యులర్ గా వార్తల్లో వినిపిస్తూనే ఉంటుంది. ఈ అందాల భామకు ఉన్న క్రేజ్ గురించి, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాంకర్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న అనసూయ. ఆతర్వాత సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంది. జబర్దస్త్ ద్వారా అనసూయ బాగా పాపులర్ అయ్యింది.
Anasuya
అనసూయ భరద్వాజ్. న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రాంరంభించి ఆతర్వాత యాంకర్‌గా మారింది ఈ ముద్దుగుమ్మ. యాంకర్‌గా ఎన్నో టీవీషోలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రముఖ టీవీ షో జబర్దస్త్ ద్వారా అనసూయ బాగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక సినిమాల్లో నటిస్తూ అలరిస్తుంది. సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాల్లో అవకాశాలు అందుకుంది. ఇక ఇప్పుడు టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తూ బిజీ బిజీగా గడుపుతుంది. పెళ్ళై ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ అందంలో కుర్రహీరోయిన్స్ తో పోటీపడుతోంది ఈ ముద్దుగుమ్మ.
ఇక అనసూయ టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ యమా బిజీగా ఉంది. సహాయక పాత్రల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనసూయ. అంతే కాదు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను అలరిస్తుంది. అంతేకాదు తన పై నెగిటివ్ కామెంట్స్ చేసే వారికి, తనను ట్రోల్ చేసేవారికి గట్టిగానే కౌంటర్స్ ఇస్తుంటుంది ఈ అందాల భామ. ఇదిలా ఉంటే తాజాగా అనసూయ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేసింది
సోషల్ మీడియాలో తన అందాలతో కవ్వించే అనసూయ పై కొందరి నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు . అనసూయ డ్రస్సింగ్ పై కొందరు పనిగట్టుకొని కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి వారికి ఈ ఇంటర్వ్యూలో సాలిడ్ కౌంటర్లు ఇచ్చింది అనసూయ. ఈ ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ.. నా బట్టలు నా ఇష్టం. బికినీ వేసుకుంటా.. లేదంటే విప్పుకుని తిరుగుతా.. అది నా ఇష్టం.. అడగడానికి మీరెవ్వరు అంటూ దుమారం రేపింది. ఈకామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అనసూయ కామెంట్స్ పై నెటిజన్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి