ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా సూపర్ హిట్ సినిమాలతో పాటు అదిరిపోయే గేమ్ షోలు, ఆకట్టుకునే టాక్ షోలు ప్రేక్షకులకు అందిస్తూ దూసుకుపోతుంది. వెబ్‌సిరీస్, సినిమాలు, స్పెషల్ షోలు , టాక్ షోలు, గేమ్ షోలతో ఓటీటీలు ఆడియన్స్ కు కావాల్సినంత వినోదాన్ని అందిస్తుంది ఆహా. అలాగే బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Dance Icon 2
డిజిటల్ రంగంలో 100 శాతం వినోదాన్ని అందించడమే లక్ష్యంగా ముందుకు వెళుతోంది ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా . ఇందులో భాగంగా ఇప్పటికే ఎన్ని సూపర్‌హిట్ సినిమాలు, థ్రిల్లింగ్ సస్పెన్స్ వెబ్ సిరీస్‌లను సినీ ప్రియులకు అందించింది. అలాగే అన్‌స్టాపబుల్ అంటూ టాక్‌షోలు, తెలుగు ఇండియన్ ఐడల్ సింగర్ సింగింగ్ షోలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఈనేపథ్యంలో నాన్-ఫిక్షన్ కేటగిరీలో మరోసారి తన ప్రత్యేకత చాటుకునేందుకు డ్యాన్స్ షోతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. డ్యాన్స్ ఐకాన్ పేరుతో నిర్వహించబోతోన్న ఈ షోకు ప్రముఖ యాంకర్ ఓంకార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే డాన్స్ ఐకాన్ 1 సీజన్ 1 ఎంతో విజయవంతగా సాగింది.
ఇక ఇప్పుడు డాన్స్ ఐకాన్ 2 ను మొదలు పెట్టనున్నారు. గతంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిభవంతులైన డాన్స్‌ర్ల కోసం డాన్స్ ఐకాన్ షోను పరిచయం చేసింది ఆహా. 2022 ఈ షో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ డాన్స్ షో ఎప్పుడు ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు.ఈ క్రమంలోనే తాజాగా డాన్స్ ఐకాన్ 2 కు సంబందించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు. డాన్స్ ఐకాన్ 2 మొదటి ప్రోమోను విడుదల చేశారు.
ఈ ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ ఓంకార్ తో పాటుగా ఫరియా అబ్దుల్లా, శేఖర్ మాస్టర్ , యష్ మాస్టర్,మానస్, సింగర్ జాను లైరి, మెంటార్ ప్రకృతి ఈ ప్రోమోలో కనిపించి ఆకట్టుకున్నారు. అలాగే నటి రోహిణి తన కామెడీతో నవ్వులు పూయించారు. షోలో ఫస్ట్ రౌండ్ విజేతలను మెంటార్స్ నిర్ణయిస్తే, సెకండ్ రౌండ్ లో ఎవరు విజేతలు అనేది ప్రేక్షకులు తమ ఓటింగ్ ద్వారా డిసైడ్ చేస్తారు. ఇక ‘డ్యాన్స్ ఐకాన్ 2 ఎలా ఉంటుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి