మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్... కోలార్‌లోని టేకల్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం సృష్టించాడు. అతగాడి వేగానికి సీదా... రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశించి ప్లాట్‌ఫారమ్‌పై ఆగింది కారు. అదృష్టవశాత్తూ, ఆ సమయంలో రైలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ తప్ప తాగి కారు నడిపినట్లు పోలీసులు ధృవీకరించారు.
Car Rams Into Railway Station
మద్యం మత్తులో నియంత్రణ కోల్పోయిన ఓ వ్యక్తి తన కారుతో రైల్వే స్టేషన్‌లోకి దూసుకెళ్లిన ఘటన కర్నాటకలోని కోలార్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటన కోలార్ జిల్లా మలూరు తాలూకాలోని టేకల్ రైల్వే స్టేషన్‌లో శనివారం అర్థరాత్రి జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి అర్థరాత్రి మారుతీ స్విఫ్ట్ డిజైర్ కారుతో రైల్వే స్టేషన్‌లోకి దూసుకెళ్లాడు. కారు రైల్వే టికెట్ కౌంటర్ ముందు మెట్లపై నుంచి నేరుగా రైల్వే ప్లాట్‌ఫారమ్‌పైకి వచ్చింది.
దీన్ని బట్టి డ్రైవర్ ఎంత మద్యం మత్తులో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. తర్వాత కారు నేరుగా వెళ్లి రైల్వే ట్రాక్‌పై ఆగింది. సినిమా తరహాలో ఈ ఘటన జరగ్గా, ట్రాక్‌పైకి నిలిచి ఉన్న కారును చూసిన రైల్వే సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. వాహనం నడిపిన రాకేష్ అనే వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు జేసీబీ సాయంతో కారును క్లియర్ చేశారు.
చాలా రైళ్లు ప్రయాణించే జంక్షన్
టేకల్ రైల్వే స్టేషన్ చాలా రైళ్లు ప్రయాణించే జంక్షన్. కారు ట్రాక్‌పైకి వచ్చిన సమయంలో ఏదైనా ట్రైన్ వచ్చి ఉంటే పెను ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో రైలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది.