ఒక పక్క బంగారం ధరలు భగభగమంటుంటే.. మరోపక్క బంగారు దొంగతనాలు అంతే స్థాయిలో పెరుగుతున్నాయి. నంద్యాల జిల్లా కేంద్రంలో ఛైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. స్థానిక కోట వీధిలోని గుడిలో దేవుడిని దర్శనం చేసుకొని ఇంటికి వెళుతుండగా.. మహిళ మెడలోని చైన్‌ను చిటికెలో లాక్కెళ్ళారు దొంగలు. క్షణకాలంలో మెడలోని చైన్.. స్నాచర్లు లాక్కెళ్ళడంతో మహిళ భయభ్రాంతులు గురైంది.
నంద్యాల జిల్లా డోన్ పట్టణానికి చెందిన అదిలక్షీ అనే మహిళ దైవ దర్శనం కోసం స్థానిక కోట వీధికి వచ్చింది. దైవ దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణంలో కోట వీదిలోని అత్తగారికి ఇంటికి నడుచుకుంటు వెళితుండగా మహిళకు ఎదురుగా బైక్ పై వచ్చి మెడలోని ఐదు తులాల బంగారు ఛైన్ లాక్కెళ్ళారు.
క్షణకాలంలో జరిగిన ఘటనతో మహిళ తెరుకునేలోపే దొంగలు పరారయ్యారు. మహిళ కేకలు వెయ్యడంతో స్థానికులు మహిళ దగ్గరకు చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు సంఘటన స్థలం చేరుకుని విచారణ చేపట్టారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటన స్థలంలో ఉన్న సీసీ కెమెరాలను పోలీసుల క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి