విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎంత పెద్ద హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు. డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా గత నెల జనవరి 14న విడుదలై భారీగా వసూళ్లు రాబట్టింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు అడియన్స్ నుంచి ఓ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో వెంకీ జోడిగా ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. మొదటి రోజు నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో చిత్రయూనిట్ ఇటీవల హైదరాబాద్ వేదికగా గ్రాండ్ సక్సెస్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. అయితే ఈ సినిమా ఎంతగా హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు.
సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ భీమాల. ఈ సినిమాలో వెంకటేశ్, ఐశ్వర్య రాజేష్ దంపతుల కుమారుడు బుల్లిరాజు పాత్రలో కనిపించాడు రేవంత్. తన కామెడీ, డైలాగ్స్, యాక్టింగ్ తో సినీప్రియుల మనసులు గెలుచుకున్నాడు. ముఖ్యంగా బుల్లిరాజు పాత్రను తెరపై చూడగానే అడియన్స్ పొట్టచెక్కలయ్యేలా నవ్వారు. అటు సోషల్ మీడియాలోనూ బుల్లిరాజు సీన్స్ ఎంతగా వైరల్ అయ్యాయో చెప్పక్కర్లేదు. ఇక సినిమా సక్సెస్ తర్వాత బుల్లిరాజు పేరు మారుమోగింది.
ఇదిలా ఉంటే.. బుల్లిరాజు అలియాస్ రేవంత్ తండ్రి పోలీసులను ఆశ్రయించారు. తన కుమారుడి పేరును సోషల్ మీడియా వేదికగా కొందరు దుర్వినియోగానికి పాల్పడుతున్నారని తెలిపారు. రేవంత్ భీమాల పేరుతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి రాజకీయపరమైన పోస్టులు పెడుతున్నారని.. బుల్లిరాజు తండ్రి భి. శ్రీనివాసరావు అభిమానులకు విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి
“కొద్ది రోజులుగా మా అబ్బాయి పేరిట ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ప్రమోషన్స్ కోసం వీడియోను వక్రీకరించి తప్పు ప్రచారం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. మా అబ్బాయికి సంబంధించిన అధికారిక వివరాలు, అప్డేట్స్ సోషల్ మీడియాలో కేవలం రేవంత్ భీమాల అనే పేరు మీద ఉన్న ఇన్ స్టా ప్రోఫైల్ నుంచి మీతో ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటాం. ఇది తప్పు ఫేస్ బుక్, యూట్యూబ్, ఎక్స్, ఇన్ స్టాలో మాకు ఎటువంటి ఇతర అకౌంట్స్, ఛానల్స్ లేవు. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాం. దయచేసి మాకు, ముఖ్యంగా మా అబ్బాయిని ఇటువంటి వివాదాలు, రాజకీయాలతో ముడి పెట్టవద్దని అన్ని మీడియా వేదికలకు తెలియజేస్తున్నాం.” అంటూ ఇన్ స్టాలో షేర్ చేశారు బుల్లిరాజు తండ్రి.
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన