ఎఫ్ 2,ఎఫ్ 3 వంటి సూపర్ హిట్స్ తర్వాత వెంకటేశ్ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరెకెక్కిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. వెంకటేశ్, ఐశ్వర్య, మీనాక్షిల నటనకు మంచి పేరొచ్చింది.
Dil Raju
ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విడుదలైన ఈ సినిమాలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటు కలెక్షన్స్ కూడా రాబట్టింది. ఇక ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ యమా హుషారుగా చేస్తున్నారు. తాజాగా డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్ నిర్వహించారు. ఈ మీట్ లో దిల్ రాజు మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేశారు.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్ పెడతామని చెప్పగానే చాలా ఆనందంగా అనిపించింది. సాధారణంగా డిస్ట్రిబ్యూటర్స్ కి బ్రేక్ ఈవెన్ అయితేనే సూపర్ హిట్ అని చెప్పుకునే పరిస్థితి నెలకొంది. వాళ్ళు నష్టపోయినప్పుడు కూడా సినిమా సూపర్ హిట్ పోస్టర్స్ పడుతుంటాయి .కల్చర్ మారిపోయింది. 90% ఫెయిల్యూర్స్ ఉండే ఇండస్ట్రీ ఇది. జస్ట్ 10% మాత్రమే సక్సెస్. మా డిస్ట్రిబ్యూటర్స్ సక్సెస్ ఫెయిల్యూర్స్ అన్నిటిని తట్టుకుని మాతో జర్నీ కంటిన్యూ చేస్తున్నారు. 20 ఏళ్ల పాటు ఒక ప్రొడ్యూసర్ తో డిస్ట్రిబ్యూటర్స్ కంటిన్యూ అవ్వడం అనేది ఇండస్ట్రీలో చాలా ఆరుదు. డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ థాంక్యూ.
బడ్జెట్ కాదు కథలే ఇంపార్టెంట్. మేము కూడా కథలని నమ్ముకుని సినిమాలో నిర్మించాం. కొత్త దర్శకులతో తీసినప్పుడు ఎన్ని సక్సెస్ లు క్లాసిక్సులు వచ్చాయో అందరికి తెలిసిందే. మేము కూడా కాంబినేషన్స్ అని గత నాలుగు ఐదు ఏళ్ళుగా తడబడుతున్నాం. అనిల్ మళ్ళీ మాకు రూటు చూపించారు. సంక్రాంతికి వస్తున్నాం సెన్సేషనల్ హిట్. సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ తో ఒక రహదారి వేసి ఇచ్చాడు. మా సంస్థ నుంచి అద్భుతమైన సినిమాలు రావడానికి ఇది మాకు ఒక బిగ్ ఎనర్జీ. ఈ సక్సెస్ నాకు కూడా చాలా పాఠాలు నేర్పించింది. అనిల్ తో ఆరు సినిమాలు చేస్తే ఆ 6 విజయవంతం అయ్యాయి. అనిల్ తో సినిమా తీసినప్పుడు నిర్మాతగా ఒత్తిడికి లోనవ్వలేదు. తనతో నాకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎక్కడో పడిపోతున్న మమ్మల్ని పైకి తీసుకొచ్చి నిలబెట్టాడు. మళ్ళీ అద్భుతమైన సినిమాలు తీస్తాం. రిజల్ట్స్ 100% వస్తాయి. వెంకటేష్ గారు ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ హీరో. ఆయన నిర్మాతలు ఇచ్చే గౌరవం మాములుగా ఉండదు. అందుకే అద్భుతంగా ఆయనతో నాలుగు సినిమాలు చేయగలిగాం. ఈ సినిమా ఇంత పెద్ద విజయం అవ్వడానికి కారణమైన వెంకటేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మా టీమ్ అందరికీ థాంక్యు వెరీ మచ్’ అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి