ప్రపంచవ్యాప్తంగా ఈవీ స్కూటర్ల డిమాండ్ రోజురోజుకూ పెరుగుతుంది. పెరుగుతున్న పెట్రోల్ ధరల దెబ్బకు సామాన్యుడు ఈవీ స్కూటర్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో టాప్ కంపెనీల నుంచి స్టార్టప్ కంపెనీల వరకు తమ ఈవీ స్కూటర్లపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా ఆన్‌లైన్ ద్వారా కస్టమర్లకు అందుబాటులో ఉండేలా ఈ-కామర్స్ సైట్స్‌లో కూడా అమ్మకాలు సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్‌లో ప్రస్తుతం ఈవీ స్కూటర్లపై ప్రత్యేక తగ్గింపులను అందిస్తున్నారు. ఆ వివరాలను ఓ సారి తెలుసుకుందాం.
Srinu |
Updated on: Feb 12, 2025 | 2:45 PM
ఏఎంఓ కంపెనీకు సంబంధించిన మరో ఈవీ స్కూటర్ జాంటీ ఎల్ లీడ్ యాసిడ్ తక్కువ వేగంతో పాటు పోర్టబుల్ ఛార్జర్‌తో లభిస్తుంది. ఈ స్కూటర్‌లో యాంటీ-థెఫ్ట్ అలారం వల్ల ఈ స్కూటర్‌పై దొంగతనం భయాలు ఉండవు. ఈ స్కూటర్‌లో బ్లూటూత్ మ్యూజిక్ సిస్టమ్ ఆకట్టుకుంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ నడపడం కూడా చాలా సులభం. ఈ స్కూటర్ మార్కెట్, ఆఫీసు లేదా కళాశాలకు వెళ్లేలా అంటే పట్టణ ప్రాంత ప్రజలను దృష్టిలో పెట్టుకుని లాంచ్ చేశారు. ఈ స్కూటర్‌ను కేవలం రూ. 54,077కు సొంతం చేసుకోవచ్చు.
1 / 5
ఏఎంఓ ఎలక్ట్రిక్ స్కూటర్ జాంటీ లిథియం బ్యాటరీతో ఆకట్టుకుంటుంది. గ్రే కలర్‌లో అందుబాటులో ఉండే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో పోర్టబుల్ ఛార్జర్‌తో పాటు స్టైలిష్ ఎల్ఈడీ లైటర్లతో వస్తుంది. ఈ స్కూటర్‌పై ప్రత్యేక ఈఎంఐ ఆఫర్‌ను కంపెనీ అందిస్తుంది. ఈ స్కూటర్ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి 3 నుండి 4 గంటలు మాత్రమే పడుతుంది. ఈ స్కూటర్ ధర రూ.74691కు కొనుగోలు చేయవచ్చు.
2 / 5
ఆంపియర్ కంపెనీకి చెందిన ఈవీ స్కూటర్ ఈఎక్స్ గెలాక్టిక్ అమెజాన్‌లో రూ.74,999కు అందుబాటులో ఉంది. గెలాక్సీ గ్రే కలర్‌లో అందుబాటులో ఉండే ఈ స్కూటర్‌లో మూడు డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 3 సంవత్సరాల వారంటీతో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్‌తో పాటు స్టాండ్ సెన్సార్ కూడా ఆకట్టుకుంటుంది.
3 / 5
ఈఓఎక్స్ కంపెనీకు సంబంధించిన ఈ-2 4జీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎరుపు రంగులో అందుబాటులో ఉంటుంది. ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కూడా ఈ స్కూటర్ నడపవచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీ డిజైన్‌తో కూడిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజిటల్ డిస్‌ప్లే, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, ట్యూబ్‌లెస్ టైర్లు, వెనుక డిస్క్ బ్రేక్, ముందు డిస్క్ బ్రేక్‌లతో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో వాటర్‌ప్రూఫ్ బీఎల్‌డీసీ మోటార్‌తో వస్తుంది. ఈ స్కూటర్ రూ.47,998కు కొనుగోలు చేయవచ్చు.
4 / 5
ఈఓఎక్స్ ఈ2 ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుతం అమెజాన్‌లో రూ.51,498కు అందుబాటులో ఉంది. ఈ స్కూటర్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే 60 నుంచి 80 కిలో మీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. ఈ స్కూటర్ వాటర్ ప్రూఫ్ మోటార్‌తో ఆకట్టుకుంటుంది. ఈ స్కూటర్‌లో నలుపు, ఎరుపు కాంబినేషన్‌లో ఆకర్షిస్తుంది. మంచి డిజైన్‌తో పాటు కూడిన ఈ స్కూటర్ మొబైల్ ఛార్జింగ్ కోసం యూఎస్‌బీ పోర్ట్, హై రిజుల్యూషన్ డిస్‌ప్లే ఈ స్కూటర్ ప్రత్యేకతలుగా ఉన్నాయి.
5 / 5