ఆధునిక కాలంలో ఆన్ లైన్ గేమింగ్ కు ఆదరణ పెరిగింది. పిల్లల నుంచి పెద్దల వరకూ వీటిపై ఆసక్తి చూపుతున్నారు. మెదడుకు పదునుపెట్టే, ఉత్సాహాన్ని కలిగించే, వినోదాన్ని అందించే రకరకాల గేమ్ లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించడంలోనూ కీలకంగా మారాయి. అయితే గేమింగ్ కోసం సాధారణ ల్యాప్ టాప్ లు పనికిరావు. దానికి వేగవంతమైనప్రాసెసర్, మంచి బ్యాటరీ, స్పష్టమైన స్క్రీన్ చాలా అవసరం. ఈ నేపథ్యంలో గేమింగ్ కోసం వివిధ కంపెనీలు ప్రత్యేకంగా ల్యాప్ టాప్ లను రూపొందించాయి. అమెజాన్ లో భారీ డిస్కౌంట్ పై అందుబాటులో ఉన్నల్యాప్ టాప్ లు, వాటి ప్రత్యేకతలను తెలుసుకుందాం.
Srinu |
Updated on: Feb 06, 2025 | 5:00 PM
మార్కెట్ లో అందుబాటులో ఉన్న అత్యుత్తమ గేమింగ్ ల్యాప్ టాప్ లలో అసస్ టీయూఎఫ్ గేమింగ్ ఎఫ్17 ముందు వరుసలో ఉంటుంది. దీనిలోని స్మార్ట్ కూలింగ్ టెక్నాలజీ తో ఎక్కువ కాలం పనిచేస్తుంది. ఐపీఎస్ ప్యానెల్ తో కూడిన హెచ్ డీ 17.3 అంగుళాల స్క్రీన్, ఎన్వీఐడీఐఏ జీఫోర్స్ ఆర్టీఎక్స్ 2050 గ్రాఫిక్ కార్డుతో గేమింగ్, వీడియో ఎడిటింగ్ చాలా వేగంగా చేసుకోవచ్చు. విస్తరించుకోగల 16 జీబీ ర్యామ్, హేవీ డ్యూటీ ఫైల్స్ ను దాచుకోవడానికి 512 జీబీ ఎస్ఎస్డీ, విండోస్ 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్, యాంటీ గ్లేర్, బ్యాక్ లైట్ కీబోర్డు తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. అమెజాన్ లో 53,990కి ఈ ల్యాప్ టాప్ అందుబాటులో ఉంది.
1 / 5
ఏసర్ ఆస్పైర్ 5 గేమింగ్ ల్యాప్ టాప్ పనితీరు చాలా సమర్థంగా ఉంటుంది. ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్, ఎన్వీఐడీఐఏ జీఫోర్స్ ఆర్టీఎక్స్ 2050 గ్రాఫిక్ కార్డు తో వేగంగా పని చేసుకోవచ్చు. 15.6 అంగుళాల పూర్తి హెచ్ డీ స్క్రీన్ తో విజువల్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏసర్ కామ్ఫైవ్యూ డిస్ ప్లే కారణంగా కళ్లకు ఎలాంటి ఒత్తిడి ఉండదు. 170 డిగ్రీల కోణంలోనూ స్పష్టంగా చూడవచ్చు. 16 జీబీ ర్యామ్, 512 జీబీ సాలిడ్ స్టేట్ డ్రైవ్, చీకటిలోనూ కనిపించేలా బ్యాక్ లైట్ కీ బోర్డు, అంతర్నిర్మిత ఫింగర్ ప్రింట్ రీడర్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ల్యాప్ టాప్ ను అమెజాన్ లో రూ.56,990కి కొనుగోలు చేయవచ్చు.
2 / 5
గేమింగ్ కోసం రూపొందించిన బెస్ట్ ల్యాప్ టాప్ లలో ఎంఎస్ఐ థిన్ 15 ఒకటి. ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్ తో సమర్థవంతంగా పనిచేస్తుంది. 40 సెంటీమీటర్ల హెచ్ పీ డిస్ ప్లేతో విజవల్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్వీఐడీఐఏ జీఫోర్స్ ఆర్టీఎక్స్ 3050 గ్రాఫిక్ కార్డుతో గేమింగ్, వీడియో ఎడిటింగ్ చక్కగా చేసుకోవచ్చు. అంతర్నిర్మిత వైఫై 6ఈ, బ్లూటూత్ వీ5.3 స్థిరమైన, వేగవంతమైన వైర్ లెస్ కనెక్టివీటిని అందిస్తాయి. వివిధ వైర్ లెస్ పరికరాలతో ల్యాప్ టాప్ ను కనెక్ట్ చేసుకోవచ్చు. అమెజాన్ లో రూ.61,800కు అందుబాటులో ఉంది. ఈ ల్యాప్ టాప్ ను అమెజాన్ లో రూ.60,990 కొనుగోలు చేయవచ్చు.
3 / 5
మల్టీ టాస్కింగ్, 3 డీ రెండింగ్, హెవీ గేమ్ ప్లే కోసం హెచ్ పీ కంపెనీ ఈ విక్టస్ ల్యాప్ టాప్ ను విడుదల చేసింది. దీనిలోని 6 కోర్ ఏఎండీ రైజెన్ 5 ప్రాసెసర్ తో పనితీరు బ్రహ్మాండంగా ఉంటుంది. ఎన్వీఐడీఐఏ జీఫోర్స్ ఆర్టీఎక్స్ 3050 గ్రాఫిక్ కార్డుతో అత్యున్నత స్థాయి గేమింగ్ ఆపరేషన్ పొందవచ్చు. 15.6 అంగుళాల పూర్తి హెచ్ డీ డిస్ ప్లే, కళ్లకు ఒత్తిడిని తగ్గించే యాంటీ గ్లేర్, 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజీ, 52.5 డబ్ల్యూహెచ్ బ్యాటరీ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. నిరంతరాయంగా పనిచేసేందుకు వేగవంతమైన చార్జింగ్ ఫీచర్ ఉపయోగపడుతుంది.
4 / 5
వేగం, సామర్థ్యం కోరుకునే వారికి లెనోవా ఎల్వోక్యూ గేమింగ్ ల్యాప్ టాప్ మంచి ఎంపిక. ఏఎండీ రైజెన్ 5 ప్రాసెసర్, ఎన్వీఐడీఐఏ జీఫోర్స్ ఆర్టీఎక్స్ 3050 గ్రాఫిక్ కార్డుతో పనితీరు సమర్థవంతంగా ఉంటుంది. 15.8 అంగుళాల పూర్తి హెచ్ డీ డిస్ ప్లే, 12 జీబీ ర్యామ్, హైపర్ చాంబర్ కూలింగ్ డిజైన్ తో కూడిన డ్యూయల్ ఫ్యాన్లు తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేస్తుంది. అమెజాన్ లో ఈ ల్యాప్ టాప్ ను రూ.62,490కి కొనుగోలు చేసుకోవచ్చు.
5 / 5