Shreyas Iyer Half Century: నాగ్‌పూర్‌లోని వీసీఏ స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ జోస్ బట్లర్, జాకబ్ బెథెల్ అర్ధ సెంచరీలు సాధించారు. భారత జట్టులో అరంగేట్రం చేసిన హర్షిత్ రాణా, స్పిన్నర్ రవీంద్ర జడేజా చెరో 3 వికెట్లు పడగొట్టారు.
ప్రస్తుతం భారత్ 17 ఓవర్లలో భారత్ 3 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. జట్టు నుంచి శుభ్‌మాన్ గిల్, అక్షర్ పటేల్ క్రీజులో ఉన్నారు. శ్రేయాస్ 30 బంతుల్లో అర్ధ సెంచరీలు సాధించాడు. ఇంగ్లాండ్ తరపున జోఫ్రా ఆర్చర్, సాకిబ్ మహమూద్ తలో వికెట్ పడగొట్టారు. యశస్వి జైస్వాల్ 15 పరుగులు చేసి అవుట్ కాగా, రోహిత్ శర్మ 2 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
హాఫ్ సెంచరీతో భారత్ స్కోరును 100 దాటించిన శ్రేయాస్..
శ్రేయాస్ అయ్యర్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 30 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతను ఇప్పటివరకు 9 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టాడు. 14వ ఓవర్ చివరి బంతికి ఫోర్ కొట్టడం ద్వారా అతను భారత్ స్కోరును 100 పరుగుల మార్కును దాటించాడు. ఈ క్రమంలో 15.6 ఓవర్‌లో శ్రేయాస్ అయ్యర్ (59) బెతెల్ బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్ చేరాడు.
ఇవి కూడా చదవండి
పవర్ ప్లేలోపే 2 వికెట్లు కోల్పోయిన భారత్..
ఇంగ్లాండ్‌కు చెందిన బ్రైడాన్ కార్స్ 10వ ఓవర్ బౌలింగ్ చేయగా, ఆ ఓవర్‌లో భారత్ 12 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ ఆ ఓవర్‌లో 3 ఫోర్లు కొట్టాడు. శుభ్‌మాన్‌తో కలిసి రెండో వికెట్‌కు యాభై పరుగుల భాగస్వామ్యాన్ని కూడా పూర్తి చేశాడు.
ఇరు జట్లు..
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ
ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11:
బెన్ డకెట్, ఫిల్ సాల్ట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్, లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, బ్రైడాన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహ్మద్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..