బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయ పరిణామాల ప్రకారం.. పసిడి, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి.. ఒక్కోసారి ధరలు తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతూ వస్తుంటాయి.. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు .. రికార్డు స్థాయికి చేరుకున్నాయి.. 80 వేల మార్క్ దాటి పరుగులు పెడుతున్నాయి.. తాజాగా.. కూడా గోల్డ్, సిల్వర్ ధరలు స్వల్పంగా పెరిగాయి.. శనివారం (18 జనవరి 2025) ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.74,510, 24 క్యారెట్ల పసిడి ధర రూ.81,280 గా ఉంది. వెండి కిలో ధర రూ.96,600 లుగా ఉంది. పది గ్రాముల బంగారంపై రూ.10 మేర పెరగగా, వెండిపై రూ.100 మేర ధర పెరిగింది..
దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..
బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.74,510, 24 క్యారెట్ల ధర రూ.81,280 గా ఉంది.
విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.74,510, 24 క్యారెట్ల ధర రూ.81,280 గా ఉంది.
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.74,660, 24 క్యారెట్ల ధర రూ.81,430 గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.74,510, 24 క్యారెట్ల ధర రూ.81,280 గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల రేట్ రూ.74,510, 24 క్యారెట్లు రూ.81,280 లుగా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.74,510, 24 క్యారెట్ల ధర రూ.81,280 గా ఉంది.