భారత టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల ఫామ్ లో ఉన్నట్టుగా కనిపించలేదు. బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్సీలోనూ విఫలం అవడంతో, BCCI భవిష్యత్ నాయకత్వంపై దృష్టి పెట్టింది. టెస్ట్ క్రికెట్‌లో రోహిత్ ప్రభావం తగ్గిపోతుండటంతో, కొత్త కెప్టెన్ ఎవరవుతారనే చర్చ బలంగా జరుగుతోంది.
38 ఏళ్లకు దగ్గరపడుతున్న రోహిత్, ఇప్పటికే T20I నుంచి రిటైర్మెంట్ ప్రకటించగా, వన్డేలు, టెస్ట్‌ల్లో కొనసాగుతున్నాడు. అయితే, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లలో అతని ప్రదర్శన నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో, రోహిత్ తర్వాత BCCI కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేసే దిశగా ఆలోచిస్తోంది.
బుమ్రా కాదు – BCCI ప్లాన్‌లో ఈ ఇద్దరు!
జస్ప్రీత్ బుమ్రా టెస్ట్ కెప్టెన్సీకి ఒక ప్రధాన అభ్యర్థిగా కనిపించినా, అతని ఫిట్‌నెస్ కారణంగా దీర్ఘకాలిక ఎంపిక కాదని BCCI భావిస్తోంది. బుమ్రా గతంలో గాయాల సమస్యలతో తరచూ జట్టుకు దూరమవుతున్నాడు. టెస్ట్ ఫార్మాట్‌లో నిరంతరంగా ఆడగలిగే కెప్టెన్ అవసరమని సెలెక్టర్లు అభిప్రాయపడ్డారు.
BCCI నివేదిక ప్రకారం, రిషబ్ పంత్ లేదా యశస్వి జైస్వాల్ లు కొత్త కెప్టెన్సీ కోసం ప్రధాన అభ్యర్థులుగా పరిశీలనలో ఉన్నారు.
రిషబ్ పంత్ గాయాల నుంచి తిరిగి వస్తున్నప్పటికీ, అతనిలో సహజ నాయకత్వ లక్షణాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఇక యశస్వి జైస్వాల్ యువ ఆటగాడిగా రాబోయే రోజుల్లో భారత క్రికెట్‌ను ముందుండి నడిపించే సత్తా కలిగి ఉన్నాడు. శుభ్‌మాన్ గిల్ కూడా కెప్టెన్సీకి అభ్యర్థిగా పరిశీలించబడుతున్నప్పటికీ, టెస్ట్ క్రికెట్‌లో అతని ప్రదర్శన నిరుత్సాహపరిచిందని BCCI భావిస్తోంది. సెలెక్టర్లు నిరంతరంగా మంచి ఫామ్‌లో ఉన్న ఆటగాడిని కెప్టెన్‌గా ఎంపిక చేయాలని చూస్తున్నారు.
ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు, రోహిత్ తన ఫామ్ పై వస్తున్న ప్రశ్నలకు కాస్త అసహనం వ్యక్తం చేశాడు. “ఈ ప్రశ్న ఎందుకు? ఇది వేరే ఫార్మాట్, వేరే సమయం. క్రికెటర్లుగా హెచ్చు తగ్గులు సహజం. నా కెరీర్‌లో ఇప్పటికే చాలా దశలను చూశాను. ప్రతి రోజు కొత్తది, ప్రతి సిరీస్ కొత్త సిరీస్” అని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు.
BCCI టెస్ట్ కెప్టెన్సీలో మార్పులకు సిద్ధంగా ఉంది. రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్ లను భవిష్యత్ కెప్టెన్సీకి సిద్ధం చేయాలనే ఆలోచన బలంగా ఉంది. రోహిత్ తర్వాత భారత టెస్ట్ జట్టుకు కొత్త నాయకుడు ఎవరనేది రాబోయే టెస్ట్ సిరీస్‌లలో స్పష్టమవుతుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..