ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలో.. ఆశ్చర్యకర ఘటన వెలుగుచూసింది. ఓ రైతు పొలం దున్నతుండగా పురాతన కరవాలం బయటపడింది. అయితే గతంలో కూడా ఈ గ్రామ శివార్లోని పొలాల్లో చారిత్రక ఆనవాళ్లకు సంబంధించిన అవశేషాలు బయపడినట్లు స్థానికులు చెబుతున్నారు.
Ploughing
ప్రతిరోజూ లాగానే ఆ రైతు తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాడు.. పొలం పనుల్లో నిమగ్నం అయ్యాడు. దుక్కి దున్నుతుండగా బయటపడింది చూసి ఒక్కసారిగా ఆ రైతు ఆశ్చర్యపోయాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలో పురాతన వీరభద్ర స్వామి ఆలయం ఉంది. ఆ టెంపుల్ సమీపంలో ఉన్న పొలం దున్నుతుండగా కాకతీయుల కాలం నాటి ఖడ్గం బయటపడింది. లభించిన ఖడ్గం పూర్తిగా శిథిలమై ఉండటంతో ఆలయంలోనే భద్రపరిచారు.
అయితే గత 15 ఏళ్ల క్రితం ఇదే ప్రాంతంలో వీరభద్ర స్వామి వారి పంచలోహ విగ్రహం బయటపడిందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడు పురాతన ఖడ్గం లభించడంతో తుంబూరు గ్రామస్థులు ఆశ్చర్య పోతున్నారు. కాకతీయుల కాలం నాటికి చెందిన పురాతన వస్తువులు ఇంకా దొరుకుతాయేమోనని గ్రామస్థులు చర్చించుకుంటున్నారు. బయటపడిన ఖడ్గాన్ని చూడటానికి గ్రామస్థులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.. పురాతన కాలం నాటి ఆలయాలతో పాటు కాకతీయుల కాలంలో వాడిన వస్తువులు ఆనవాళ్లు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు బయట పడిన వస్తువులను బట్టి చూస్తే ఈ ప్రాంతానికి చారిత్రక నేపథ్యం ఉందని .. పరిశోధన చేస్తే.. మరిన్ని ఆసక్తికరమైన చారిత్రక ఆనవాళ్లు బయటపడే అవకాశం ఉందటున్నారు స్థానికులు.
ఖడ్గం వీడియో దిగువన చూడండి….
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..