ఇటీవల ఓ తెలుగు సినిమాలో చెప్పినట్టు రోడ్డు ప్రమాదం అంటే ఓ వ్యక్తి రోడ్డుపై పడడం కాదు.. ఓ కుటుంబం రోడ్డున పడడం అని. ఇంటి పెద్ద లేకపోతే ఆ కుటుంబ పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంటుందో? అందరికీ తెలుసు. ఇలాంటి సందర్భంలో వారికి భరోసా కల్పించేందుకు వివిధ బీమా పాలసీలు అందుబాటులో ఉంటున్నాయి. ముఖ్యంగా వాహనం కొనుగోలు చేసినప్పుడే తప్పనిసరిగా ఇన్సూరెన్స్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో ఆన్‌లైన్ క్లెయిమ్స్ చేసే వారి సంఖ్య పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. దేశంలో పెరిగిన డిజిటల్ విప్లవంతో మోటార్ బీమా విషయంలో ఆన్‌లైన్ క్లెయిమ్ సెటిల్మెంట్ పాలసీదారులకు అదనపు సౌకర్యాన్ని అందిస్తుంది. ఆన్‌లైన్ ప్రక్రియలో మీ స్మార్ట్‌ఫోన్‌లో కొన్ని క్లిక్‌లతో మీరు మీ వాహన ప్రమాద విషయాన్ని బీమా కంపెనీకు నివేదించవచ్చు. మీ వాహన, ప్రాణ నష్టం ఫోటోలు, మీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, మీ డ్రైవింగ్ లైసెన్స్ వంటి అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయవచ్చు.
బీమా సంస్థలు కూడా మీ క్లెయిమ్‌ను డిజిటల్‌గా ప్రాసెస్ చేస్తాయి. మిమ్మల్ని సమీపంలోని నెట్‌వర్క్ గ్యారేజీకి వెళ్లమని, మరమ్మతులు వెంటనే ప్రారంభించేలా బీమా కంపెనీలు ఇటీవల చర్యలు తీసుకుంటున్నాయి. భారత ప్రభుత్వం కూడా బీమా రంగంలో డిజిటలైజేషన్ ప్రయోజనాలను గుర్తించింది. 2024లో ఆన్‌లైన్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి అనేక నియంత్రణ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. బీమా నియంత్రణ, అభివృద్ధి అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) బీమా సంస్థలు సజావుగా డిజిటల్ పరిష్కారాలను అందించాలని, వేగవంతమైన క్లెయిమ్ ప్రాసెసింగ్, కస్టమర్ సంతృప్తిని నిర్ధారించాలని మార్గదర్శకాలను రూపొందించింది. ఈ నిబంధనలు బీమా సంస్థలు డేటా విశ్లేషణలు, ఏఐ ఆధారిత సాధనాలను నష్ట అంచనా కోసం స్వీకరించడానికి, మానవ తప్పిదాలను మరింత తగ్గించడానికి మరియు పరిష్కారాలను వేగవంతం చేయడానికి ప్రోత్సహిస్తాయి.
2024లో మోటారు బీమాలో సంస్కరణలు సర్వే నివేదిక అందిన ఏడు రోజుల్లోపు క్లెయిమ్‌ల పరిష్కారాన్ని తప్పనిసరి చేయడంతో 24 గంటల్లోపు సర్వేయర్లను కేటాయించడం వంటివి ఉన్నాయి. క్లెయిమ్‌ల ప్రక్రియ వేగవంతం చేసేలా కొత్త ప్రమాణాలను స్థాపించాయి. మోటార్ ఇన్సూరెన్స్‌లో ఆన్‌లైన్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ వైపు మొగ్గు చూపడం కేవలం ఒక ట్రెండ్ మాత్రమే కాదని, నేటి వేగవంతమైన భారతీయ రోడ్ల డిమాండ్‌లను తీర్చడానికి ఇది అవసరమైన పరిణామమని నిపుణులు చెబుతున్ానరు క్లెయిమ్ ప్రాసెసింగ్‌కు సంబంధించిన సాంప్రదాయ సవాళ్లను పరిష్కరించడంతో పాటు కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడం వల్ల క్లిష్ట సమయాల్లో ఆన్‌లైన్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ చాలా మందికి ఉపశమనాన్ని అందిస్తుందని పేర్కొంటున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి