పాన్ ఇండియా మోస్ట్ అవైటెడ్ మూవీ తండేల్. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో రిలీజ్ చేయనున్నారు. దీంతో కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తుంది చిత్రయూనిట్.
Naga Chaitanya
Updated on: Feb 06, 2025 | 1:53 PM
అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ తండేల్. డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇందులో చైతూ జోడిగా సాయి పల్లవి నటిస్తుంది. ఫిబ్రవరి 7న ఈ సినిమాను గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతూ తన భార్య శోభితపై ఉన్న ఇష్టాన్ని మరోసారి బయటపెట్టారు. తన వైవాహిక జీవితం గురించి అనేక విషయాలను పంచుకున్నారు. అన్ని విషయాల్లో తనకు చాలా సపోర్ట్ చేస్తుందని.. ఆమె తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతుందని అన్నారు. భాష విషయంలో తనకు సాయం చేస్తుందని అన్నారు.
చైతన్య మాట్లాడుతూ.. “శోభిత వాళ్లది వైజాగ్. మా ఇద్దరిదీ ఆంధ్రా బ్యాగ్రౌండ్.. అందుకే మా సంస్కృతి సంప్రదాయాలు, ఆచారాలు ఒక్కటే. శోభిత తెలుగు అద్భుతంగా మాట్లాడుతుంది. చాలా చక్కగా మాట్లాడుతుంది. భాష విషయంలో తను నాకు చాలా సాయం చేస్తుంది. నేను ఏదైనా కార్యక్రమంలో స్పీచ్ ఇవ్వాల్సి వస్తే తనే నాకు హెల్ప్ చేస్తుంటుంది. శోభిత నటించిన ప్రాజెక్టులలో మేడ్ ఇన్ హెవన్, మేజర్ చిత్రాలు చాలా ఇష్టం. ఆమె యాక్టింగ్ బాగుంటుంది” అని అన్నారు.
ఇదిలా ఉంటే.. ఇటీవల తండేల్ మూవీ ప్రమోషన్లలోనూ శోభితపై ఉన్న ఇష్టాన్ని తెలియజేశారు చైతూ. ఆమెను ప్రేమగా బుజ్జితల్లి అని పిలుస్తానని.. అన్ని విషయాల్లో ఆమె నిర్ణయం తీసుకుంటానని అన్నారు. తమ పెళ్లికి సంబంధించిన ప్రతిదీ ఆమె డిజైన్ చేసిందని అన్నారు.
ఇవి కూడా చదవండి
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన