పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ మూవీస్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది కల్కి 2898 ఏడీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో హారర్ కామెడీ మూవీ రాజాసాబ్ చిత్రంలో నటిస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షఊటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధీ కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ నుంచి విడుదలైన ప్రభాస్ పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. అలాగే డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇందులో కొత్త అమ్మాయి ఇమాన్వీ నటిస్తుంది. ఇవే కాకుండా యానిమల్ సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ సందీప్ వంగా దర్శకత్వంలో ప్రభాస్ స్పిరిట్ మూవీ చేయనున్నారు. వీరిద్దరి కాంబోపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ చేసుకున్న ఈ సినిమా సందీప్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. మరోవైపు ఈ ప్రాజెక్ట్ కోసం నటీనటుల ఎంపిక సైతం జరుగుతుందట.
కొద్దిరోజులుగా ఈ మూవీలో నటించే యాక్టర్స్ కోసం సెర్చింగ్ స్టార్ట్ చేశారట సందీప్ రెడ్డి వంగా. ఈ క్రమంలోనే ఇప్పుడు స్పిరిట్ మూవీ గురించి ఓ క్రేజీ న్యూస్ లీకైంది. ఈ సినిమాలో కీలకపాత్రకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను ఎంపిక చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్. మరోవైపు వరుణ్ తేజ్ తో సందీప్ చర్చలు జరుగుతున్నాయని.. ఇంకా ఆ విషయాలు కొలిక్కి రాలేదని టాక్. అయితే ఈ సినిమాలో నటించేందుకు వరుణ్ సైతం సుముఖంగా ఉన్నారని టాక్ వినిపిస్తుంది. కానీ వరుణ్ పాత్రకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు.
స్పిరిట్ చిత్రంలో హీరో పాత్రకు ధీటుగా వరుణ్ పాత్ర కూడా ఉండనుందని టాక్. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. అలాగే ఈ సినిమాలోని హీరోయిన్ గురించి కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ లో స్పిరిట్ మూవీ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానుందని టాక్.
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..