తెలంగాణ కాంగ్రెస్‌లో కల్లోలం మొదలైంది. 10 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల రహస్య భేటీపై ప్రకపంనలు రేపుతోంది. దాదాపు 10మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో సీక్రెట్ మీటింగ్‌లో పాల్గొన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఓ మంత్రి తీరుపై ఎమ్మెల్యేల అసంతృప్తి ఉన్నారట. ఆయన తమను అసలు పట్టించుకోవడం లేదని ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. తమ నియోజకవర్గంలో తమకు తెలియకుండా నిర్ణయాలు జరుగుతున్నాయని వారు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. భవిష్యత్ కార్యాచరణపై వారంతా ఈ సమావేశంలో సమాలోచనలు జరిపారు.
ఓ కీలక మంత్రి తమ నియోజకవర్గాల్లో భూములు రెగ్యులర్ చేసుకుంటున్నారని ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఉన్నారట. బీఆర్ఎస్ నేతలకు ప్రభుత్వంలో పనులు అవుతున్నాయని పలువరు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. శుక్రవారం రహస్యంగా భేటీ అయిన ఎమ్మెల్యేలకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు ఫోన్ చేశారు. ఇదే విషయంపై మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలకు మంత్రులకు సమన్వయంపై సీఎం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పటికే వర్గీకరణపై రచ్చ కొనసాగుతుండగా 10 మంది ఎమ్మెల్యేల రహస్య భేటీ మరింత హీట్ పెంచింది.
రహస్య భేటీలో పాల్గొన్న ఆ ఎమ్మెల్యేలు ఎవరంటే..
-నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, భూపతిరెడ్డి,
-జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి,
-మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి,
-నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కె.రాజేష్ రెడ్డి,
-నారాయణఖేడ్ ఎమ్మెల్యే పటోళ్ల సంజీవరెడ్డి,
-నర్సంపేట ఎమ్మెల్యే దొంతు మాధవరెడ్డి,
-మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్
-వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి సహా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయినట్టు ప్రచారం జరుగుతోంది.
కాగా, తాము భేటీలో పాల్గొన్నది నిజమేనని సీఎంకు, టీపీసీసీ చీఫ్‌కు సమాచారం ఇచ్చినట్లు 10 మంది ఎమ్మెల్యేలు చెబుతున్నారు. త్వరలోనే అధిష్టానంతో అన్ని విషయాలు మాట్లాడుతామన్నారు. మరోవైపు ఇది కేవలం ఒక మంత్రికి ఎమ్మెల్యేలకు మధ్య జరిగిన చిన్న గొడవ మాత్రమేనని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..