టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క సినిమాతోనే చాలా పాపులర్ అయిపోయింది. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంది. కానీ ఆమె నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో ఈ అమ్మడు క్రేజ్ తగ్గిపోయింది. ఫలితంగా సినిమా అవకాశాలు సైతం తగ్గిపోయాయి. దీంతో బాలీవుడ్ షిఫ్ట్ అయిన ఈ బ్యూటీ.. అక్కడ వరుస సినిమాల్లో నటించింది. ఆ తర్వాత అక్కడ సైతం సరైన బ్రేక్ రాకపోవడంతో సినిమాలకు దూరంగా ఉండిపోయింది. ఇప్పుడిప్పుడే సినీరంగంలోకి రీఎంట్రీ ఇస్తుంది. అలాగే ఇప్పుడు ఆమె 49 ఏళ్ల వయసులో పెళ్లికి రెడీ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా..? తనే తెలుగు హీరోయిన్ అమీషా పటేల్. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన నాని సినిమాతో తెలుగులో స్టార్ స్టేటస్ అందుకుంది. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. 2000లో విడుదలైన ‘కహో నా ప్యార్ హై’ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అమీషా కెరీర్ అద్భుతంగా ప్రారంభమైంది. ‘కహో నా ప్యార్’ సినిమా తర్వాత నటిగా నటించిన ‘గదర్: ఏక్ ప్రేమ్ కథ’ హిట్ అయింది. చాలాకాలం సినిమాలకు దూరంగా ఉన్న అమీషా.. ఇటీవలే గదర్ 2 సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది.
అమీషా వయసు ప్రస్తుతం 49 సంవత్సరాలు. ఇప్పటికీ ఆమె ఒంటరిగానే ఉంది. అయితే కొన్నిరోజులుగా ఆమె పేరు పాకిస్థానీ నటుడు ఇమ్రాన్ అబ్బాస్ తో ముడిపడి ఉంది. వీరిద్దరు ప్రేమలో ఉన్నారనే టాక్ వినిపిస్తుంది. తాజాగా ఈ రూమర్స్ పై స్పందించింది అమీషా.ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. “ఇవి కేవలం రూమర్స్ మాత్రమే. అందులో ఎలాంటి నిజంలేదు. గత రెండు మూడేళ్లుగా మా రిలేషన్ షిప్ గురించి వినిపిస్తున్నాయి. మేము ఈవెంట్లలో కలుస్తుంటాము. మంచి స్నేహితులం. విదేశాల్లో ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే అక్కడ కలుస్తాం. ఇద్దరు వ్యక్తులు తరచూ కలుస్తూ మంచిగా కనిపిస్తే వెంటనే రూమర్స్ స్టార్ట్ అవుతాయి. నేను సింగిల్.. అతడు సింగిల్. కాబట్టి మా ఇద్దరి పెళ్లి జరుగుతుందని వార్తలు వ్యాపిస్తాయి. కానీ అలాంటి రూమర్స్ నిజం కాదు” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో అమీషా తన ప్రేమ, పెళ్లి గురించి వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చేసింది.
ఇమ్రాన్ అబ్బాల్ ఒక పాకిస్థానీ నటుడు. బుల్లితెరపై అతడు చాలా ఫేమస్. ఇమ్రాన్ బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ వర్క్ చేశాడు. అతడు 2014లో విడుదలైన ‘క్రియేచర్ 3డి’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. అతనికి పాకిస్థాన్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..