బాలీవుడ్ హీరోయిన్స్ సినిమాల కంటే ఎక్కువగా పర్సనల్ విషయాలతోనే ఫేమస్ అవుతుంటారు. ఇండస్ట్రీలో ముక్కుసూటిగా మాట్లాడే తారలు చాలా మంది ఉన్నారు. అంతేకాదు.. ఇండస్ట్రీలో హీరోయిన్స్ పారితోషికాలు, అసమానతలు, నెపోటిజం, క్యాస్టింగ్ కౌచ్ గురించి గొంతు పెంచే హీరోయిన్స్ గురించి చెప్పక్కర్లేదు. అందులో ఈ హీరోయిన్ ఒకరు. అందం, అభినయంతో అప్పట్లో కుర్రకారును కట్టిపడేసింది. తెలుగు, హిందీలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే అండర్ వరల్డ్ డాన్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు ప్రచారమయ్యాయి. కానీ ఆ వార్తలపై ఇప్పటికీ స్పందించలేదు. 90వ దశకంలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ నటి తన అందం, చిరునవ్వుతో అభిమానులను ఫిదా చేస్తోంది. ఆ నటి బాలీవుడ్ డింపుల్ గాళ్ ప్రీతి జింటా.
ప్రీతి కెరీర్ ఎంత సక్సెస్ అయ్యిందో, ఆమె వ్యక్తిగత జీవితం కూడా అదే స్థాయిలో ప్రచారమయ్యింది. ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. కొన్ని నిర్ణయాలతో నిత్యం వార్తలలో నిలిచింది. 2009లో ప్రీతి 34 మంది బాలికలను దత్తత తీసుకోవడం అప్పట్లో అందరిని షాక్ కు గురిచేసింది. ఇప్పటివరకు ఆ ఆడపిల్లల పెంపకానికి అయ్యే ఖర్చులన్నీ తనే భరిస్తోంది. సామాజిక సేవలో ఆమె ఎంతో కృషి చేశారు. ఒకసారి అత్యాచారం వంటి నేరాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.
అంతేకాదు.. 2001 చిత్రం ‘చోరీ చోరీ చుప్కే చుప్కే’ షూటింగ్ సమయంలో తనకు 50 లక్షల రూపాయలు కావాలని కాల్స్ వచ్చాయని, ఈ విషయాన్ని కోర్టుకు నివేదించానని ప్రీతీ వెల్లడించింది. ఆ సమయంలో గ్యాంగ్‌స్టర్లకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినప్పుడు ఆమె ఎన్నో సమస్యలు ఎదుర్కొంది. కానీ ఈ అపారమైన ధైర్యానికి, అప్పటి హోం మంత్రి ఎల్‌కె అద్వానీచే ‘గాడ్‌ఫ్రే ఫిలిప్స్ నేషనల్ బ్రూవరీ అవార్డు’తో ఆమెను సత్కరించారు. ఆమెకు అన్ని చోట్లా ప్రశంసలు కూడా వచ్చాయి. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, రాణి ముఖర్జీతో పాటు ప్రీతి జింటా నటించారు. అబ్బాస్-మస్తాన్ దర్శకత్వం వహించారు. సీబీఐ సోదాలు జరగడంతో విడుదల చాలా నెలలు ఆలస్యమైంది.
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన