బెంగళూరులోని ఒక ఆటో డ్రైవర్ ఆటోలో కూర్చున్న ప్రయాణీకులకు ఉచితంగా బిస్కెట్లు పంపిణీ చేస్తున్నాడు. దీనికి కారణం ఏమిటని నేను అతనిని అడిగినప్పుడు, "నా భార్య తన పుట్టింకి వెళ్లింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను" అని చెబుతున్నారు. ఈ ఆటో డ్రైవర్ వ్యవహారం ప్రజంట్ నెట్టింట వైరల్ అవుతోంది.
Viral Auto Driver
Updated on: Feb 06, 2025 | 12:39 PM
నా భార్య పుట్టింటికి వెళ్లిందోచ్.. నేను ఫుల్ హ్యాపీగా ఉన్నానంటూ ఓ ఆటోడ్రైవర్ ఊరంతా చాటింపు వేస్తున్నాడు. అంటే నిజంగా చాటింపు వేయడం లేదండోయ్.. తన ఆటోలో ఓ నోట్ ఏర్పాటు చేసి అందరూ తెలిసేలా చేస్తున్నాడు అనమాట. భార్య పుట్టింటికి వెళ్లడంతో ఈ బెంగళూరు ఆటో డ్రైవర్ ఆనందం అంతా ఇంతా కాదు. అందుకు గానూ తన ఆటోలో ప్రయాణించేవారికి బిస్కెట్స్ పంచుతున్నాడంటే నమ్ముతారా..? అవునండి.. నమ్మకపోతే దిగువన ఉన్న ఫోటోలను చెక్ చేయండి..
ఈ ఫోటోలను ఆటోలో ఎక్కిన ప్రయాణీకులలో ఒకరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. “భార్య తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళింది, నేను సంతోషంగా ఉన్నాను” అని కన్నడ, ఇంగ్లీషులో రాయడం మీరు ఫోటోలలో చూడవచ్చు.
నెటిజన్లు ఇది కదా ‘ అసలు స్వేచ్ఛ’ అని కామెంట్స్ పెడుతున్నారు. కొంతమంది “స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు ” అని ఫన్నీగా వ్యాఖ్యానిస్తున్నారు. తను తిరిగి వచ్చాక నీకు అసలు సినిమా ఉంటుంది.. అని మరొకరు పేర్కొన్నారు. ఈ వైరల్ ఫోటోలపై మీ అభిప్రాయం కూడా తెలియజేయండి…
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..