భూమిపై వివిధ రకాల జీవులు నివసిస్తాయి. వాటిలో కొన్ని చాలా అరుదైనవి కూడా ఉన్నాయి. వాటి అరుదైన లక్షణాలతో మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. అటువంటి వింతైన, అందమైన జీవులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో తరచూ కనిపిస్తుంటాయి. ఈ క్రమంలోనే అలాంటి ఒక వింత జీవి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇది చాలా అందమైన, అరుదైన తెల్ల జింక. అవును, మంచుతో నిండిపోయిన ఓ అటవీ ప్రాంతంలో అరుదైన తెల్ల జింక కనిపించింది. అది గమనించిన ఒక మహిళ ఈ అందమైన దృశ్యాన్ని తన కెమెరాలో బంధించింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. నెటిజన్లు జింక అందాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు.
వైరల్ పోస్ట్ ప్రకారం.. మంచు ప్రాంతంలో అరుదైన తెల్లటి అల్బినో జింక కనిపించింది. ఒక అడవి దగ్గర రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతుండగా ఒక మహిళ అందమైన అల్బినో జింకను చూసింది. ఆమె ఆ దృశ్యాన్ని కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇవి కూడా చదవండి
గతంలో కబినిలో ఒక తెల్ల జింక కూడా కనిపించింది. అల్బినో జింకలు చాలా అరుదైన జంతువులు. ప్రతి లక్ష జింకలలో ఒకటి మాత్రమే ఇలాంటి తెల్ల జింకగా పుడుతుంది. కొన్ని జింకల రక్తంలో మెలనిన్ లేకపోవడం వల్ల అవి తెల్లగా ఉంటాయి. అయితే, ఇవి చూడటానికి చాలా అందంగా ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ ఒక తెల్ల జింక కనిపించింది. AccuWeather అనే X ఖాతా ద్వారా షేర్ చేయబడిన ఈ వీడియోలో, గులాబీ రంగు కళ్ళు, తెల్లటి బొచ్చుతో మంచు కుప్ప మధ్య నిలబడి ఉన్న అల్బినో జింక అందమైన దృశ్యాన్ని చూడవచ్చు.
A uncommon majestic achromatic cervid among the wintertime snowfall 🦌🌨️ Albino deers hap an mean of 1 retired of 30,000 births. pic.twitter.com/tix5doSivX
— AccuWeather (@accuweather) February 1, 2025
ఫిబ్రవరి 2న షేర్ చేయబడిన ఈ వీడియోకు 1.4 మిలియన్ల వీక్షణలు, అనేక వ్యాఖ్యలు వచ్చాయి. ఒక వినియోగదారుడు, నేను చూసిన అత్యంత అందమైన జంతువులలో ఇది ఒకటి” అని వ్యాఖ్యానించాడు. మరొక వినియోగదారుడు, “వావ్..ఇది చాలా అందమైన జంతువు” అంటూ రాశాడు. నిజంగా ఈ జీవి పరిపూర్ణ సౌందర్యానికి ప్రతిరూపం అంటూ వ్యాఖ్యానించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..