యశ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో చాలా మంది స్టార్ ఆర్టిస్టులు నటిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార, హుమా ఖురేషి, కియారా అద్వానీ, తారా సుతారియా వంటి స్టార్ హీరోయిన్లు నటిస్తున్నారు. ఇప్పటికే వీళ్ళందరూ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం బెంగళూరులో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుండగా, నటి నయన తార కూడా సెట్ లోకి అడుగు పెట్టింది. ప్రముఖ మలయాళ చిత్ర దర్శకురాలు గీతు మోహన్‌దాస్ ‘టాక్సిక్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సంవత్సరం యష్ పుట్టినరోజు సందర్భంగా ‘టాక్సిక్’ సినిమా టీజర్ విడుదలైంది. అందులో యష్ రగ్డ్ లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా గురించి మరిన్ని అప్‌డేట్‌లు తెలుసుకోవడానికి అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమం లోనే ఓ అప్డేట్ బయటికి వచ్చింది. కెవిఎన్ ప్రొడక్షన్స్’ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ‘కేజీఎఫ్ 2’ తర్వాత యష్ నటిస్తున్న సినిమా ‘టాక్సిక్’ కాబట్టి, ‘టాక్సిక్’ పై భారీ అంచనాలు ఉన్నాయి.టాక్సిక్ సినిమాకు ప్రముఖ హాలీవుడ్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. ముంబైలో ఉంటున్న ప్రముఖ బ్రిటీష్ నటుడు బెనెడిక్ట్ గారెట్ కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కాఫీ చేదుగా ఉండడం వెనుక అసలు కారణం ఇదే!
సామాన్యుల కోసం లగ్జరీ రైళ్లు..మారిన కాజీపేట స్టేషన్ రూపురేఖలు