Phani CH |
Updated on: Feb 12, 2025 | 4:39 PM
హెల్మెట్ పెట్టుకోండి, సీటు బెల్ట్ పెట్టుకోండి, మద్యం సేవించి వాహనాలు నడపకండి అని ప్రభుత్వాలు, పోలీసులు చెబుతూనే ఉన్నా చాలామంది పట్టించుకోరు. ఆనక ప్రమాదం బారినపడితే గాని వారికి పోలీసులు చెప్పిన మాటలు విలువ తెలియదు. తనిఖీల్లో పట్టుబడిన ఫైన్ కట్టేసి అక్కడే దులుపుపేసుకొని మళ్ళీ అదే పని చేస్తూ ఉంటారు. ఇలా చాలామంది చేస్తూ ఉంటారు.
వారి వెనుక కుటుంబాలు ఉన్నాయని, తాము ప్రమాదాల్లో పడితే వాళ్ళంతా ఎంత ఇబ్బంది పడతారో కూడా ఆలోచించరు. తన భర్తకు యాక్సిడెంట్ అయ్యి గాయాలతో బయటపడటంతో ఓ టీచర్ ఇలాంటి పరిస్థితి మళ్ళీ తనకు రాకూడదని ఓ ఇస్మార్ట్ ఆలోచన చేసింది. అద్భుతమైన హెల్మెట్ తయారుచేసింది. ఆ హెల్మెట్ స్పెషాలిటీ ఏంటో చూద్దాం. ఈ హెల్మెట్ వాహనదారులని ఎలా అలర్ట్ చేస్తుందంటే హెల్మెట్ పెట్టుకోని ఆ బైక్ స్టార్ట్ కాదు. అలాగే మద్యం సేవించి డ్రైవ్ చెయ్యాలని ప్రయత్నించిన బైక్ స్టార్ట్ అవదు. అంతేకాదు ఎప్పుడైనా వాహనదారుడికి ప్రమాదం జరిగితే వెంటనే సహాయం కోసం పోలీసులకు మెసేజ్ వెళుతుంది. ఈ విధంగా బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేస్తూ హెల్మెట్ ను తయారుచేశారు ఈ టీచర్. టెక్నాలజీని చక్కగా ఉపయోగించారు టీచర్ విజయ భార్గవి. అవును. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర మండలంలోని రేకులకుంట గ్రామ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఫిజిక్స్ టీచర్ గా పనిచేస్తున్నారు విజయ భార్గవి. తన భర్త హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ నడుపుతూ యాక్సిడెంట్ కు గురై చిన్న గాయాలతో బయటపడటంతో తనకు ఈ ఆలోచన వచ్చిందని భార్గవి తెలిపారు. తనకు తెలిసిన టెక్నాలజీతోనే తన భర్త ఉపయోగించే హెల్మెట్ కు ఈ ఏర్పాటు చేశానని ప్రమాదానికి గురైతే సమీప పోలీస్ స్టేషన్ కు మెసేజ్ వెళ్ళే విధంగా బైక్ హెల్మెట్ ను బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేస్తూ ఈ స్మార్ట్ హెల్మెట్ తయారుచేశానంటున్నారు టీచర్ విజయ భార్గవి. ఇలాంటి హెల్మెట్స్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా రూపకల్పన చేస్తే రోడ్డు ప్రమాదాలు కొంతవరకునైనా నివారించవచ్చని ప్రమాదాలకు గురైన వారికి తక్షణ సహాయం అందుతుందన్నారు భార్గవి. విద్యార్థులకు ఈ విధంగా పాఠాలు చెబుతూ ప్రాక్టికల్ గా చేసి చూపిస్తే వారిలో సృజనాత్మకత పెరుగుతుందని వివరించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘నాన్నా నువ్వు చనిపోతావా..’ కొడుకు మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న సైఫ్
సాయి పల్లవిని చూసి ఆశ్చర్యపోయిన నాగ్.. ఆకాశానికెత్తుతూ ట్వీట్!