సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోవాలంటే ఎంతో శ్రమించాలి. అందులోనూ సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని వారు మరింత కష్టపడాలి. అవకాశాలు వచ్చే వరకు ఓర్పు, సహనంతో ఉండాలి. అప్పుడే తమ కలలకు అడుగులు పడతాయి. ఈ నటుడికి కూడా ఎలాంటి సినిమా నేపథ్యం లేదు. గాడ్ ఫాదర్ కూడా లేడు. కానీ తన కఠోర శ్రమతో సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎదిగాడు. కోట్లాది ఆస్తులు కూడ బెట్టాడు. ఈ నటుడు సినిమా రంగంలోకి రాకముందు థియేటర్ల బయట వేరుశెనగ పల్లీలు అమ్మేవాడు. కానీ కాలం కలిసొచ్చాక అదే థియేటర్లలో ఈ హీరో సినిమాలను చూసేందుకు జనాలు క్యూ కట్టారు. ఇప్పటికీ బాలీవుడ్ లో స్టార్ నటుడిగా వెలుగొందుతోన్న జాకీ ష్రాఫ్ గురించే ఇదంతా. బాలీవుడ్ ప్రేక్షకులు, అభిమానులు జాకీ ష్రాఫ్‌ని ‘జగ్గు దాదా’ అంటారు. తన అద్భుతమైన నటనతో బాలీవుడ్ లో తనంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. జాకీ దాదా ఆన్‌స్క్రీన్‌లోనే కాకుండా ఆఫ్‌స్క్రీన్‌లో కూడా బాగా పాపులర్.
జాకీ ష్రాఫ్ కు తెలుగు వారితోనూ అనుబంధముంది. మంచు విష్ణు అస్త్రం, పంజా పవన కల్యాణ్, ఎన్టీఆర్ శక్తి, ప్రభాస్ సాహో సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 1, 1957న జన్మించిన జాకీ ష్రాఫ్ ఇటీవలే 68వ ఏట అడుగుపెట్టారు. జాకీ చాలా డౌన్ టు ఎర్త్. ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగ ఉంటున్నప్పటికీ ఎంతో సాధారణ జీవితం గడుపుతున్నాడు. జాకీ ష్రాఫ్ సినిమా రంగంలోకి రాకముందు థియేటర్ల బయట వేరుశెనగలు అమ్మేవాడని, సినిమాల పోస్టర్లు అంటించాడని చాలా మందికి తెలియదు. కానీజాకీ చాలా కాలం పాటు ఈ పనులు చేశాడు. ఆ తర్వాత జాకీ ఒక ట్రావెల్ ఏజెన్సీలో పని చేస్తున్నప్పుడు మోడలింగ్ ఆఫర్ వచ్చింది. జాకీ తన మొదటి ఉద్యోగానికి రూ.7000 జీతం అందుకున్నాడు. దీని తరువాత, అతను ట్రావెలింగ్ ఏజెన్సీలో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి, మోడలింగ్ లోనే చాలా ఏళ్ల పాటు పని చేశాడు. మోడలింగ్ చేస్తున్న సమయంలో జాకీకి దేవ్ ఆనంద్ కొడుకు సునీల్ ఆనంద్ తో పరిచయం ఏర్పడింది. వారి సహాయంతో జాకీ దేవ్ ఆనంద్‌ను కలిశాడు. జాకీని కలిసిన వెంటనే, దేవ్ ఆనంద్ అతనికి సినిమా ఆఫర్ చేశాడు. సుభాష్ ఘాయ్ జాకీని హీరోగా నటించారు. ఆ తర్వాత అతను వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు.
ఇవి కూడా చదవండి
జాకీ ష్రాఫ్ లేటెస్ట్ పోస్ట్..
జాకీ ష్రాఫ్‌కు ఈరోజు కోట్లాది రూపాయల ఆస్తులున్నాయి. ఇక జాకీ తనయుడు టైగర్ ష్రాఫ్ కూడా బాలీవుడ్ లో యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన కూతురు కృష్ణ కూడా వ్యాపారవేత్త గా గుర్తిపు తెచ్చుకుంది.
జాకీ ష్రాఫ్ తనయుడు టైగర్..
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి