Updated on: Feb 06, 2025 | 12:04 PM
ప్రపంచవ్యాప్తంగా ఎందరో అమెరికాకు వలస వెళ్తుంటారు. ఇందులో ఉపాధి కోసం వెళ్లేవారు కొందరైతే, వ్యాపారం కోసం వెళ్లేవారు కొందరు. ఇక ఉన్నత విద్యనభ్యసించేందుకు పెద్ద సంఖ్యలో విద్యార్ధులు అమెరికాకు వెళ్తుంటారు. అయితే నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మేక్ అమెరికా లక్ష్యంతో వలసదారులపై కొరడా ఝళిపిస్తున్నారు. ఈ క్రమంలో వలసదారులను బలవంతంగా వారి వారి దేశాలకు పంపిస్తున్నారు.
ఇదిలా ఉంటే .. హెచ్1బీ, ఎల్1 వీసాదారులకు కష్టాలు మరింత పెరిగే అవకాశాలున్నాయి. బైడెన్ కల్పించిన ఆటోరెన్యువల్‌ను రద్దు చేయాలని ఇద్దరు సెనెటర్లు తీర్మానం ప్రవేశపెట్టారు. అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న విదేశీయులకు మరో భారీ షాక్ ఎదురవ్వచ్చు. హెచ్-1బీ, ఎల్-1 వీసాలను ఆటోరెన్యువల్ చేసుకోవడానికి ఉన్న అవకాశాన్ని రద్దు చేయాలని ఇద్దరు రిపబ్లికన్ సెనెటర్లు తీర్మానం ప్రవేశపెట్టారు. వర్క్ వీసాలకు ఆటోరెన్యువల్ అనేది ఇమ్మిగ్రేషన్ అమలుకు అత్యంత ప్రమాదకరమైందని వారు పేర్కొన్నారు. హెచ్-1బీ, ఎల్-1 వీసాల గడువు పొడిగింపును పెంచుతూ బైడెన్ సర్కారు నిర్ణయం తీసుకొంది. గతంలో ఇది కేవలం 180 రోజులు ఉండగా.. గత సర్కారు 540 రోజులకు పెంచింది. ఈ నేపథ్యంలో ట్రంప్ కఠిన వలసల నియంత్రణ, కఠిన వీసా రూల్స్‌కు ఇది అడ్డంకిగా మారుతుందని సెనెటర్లు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో బైడెన్ నిర్ణయాన్ని రద్దు చేయాలని ఇద్దరు తీర్మానం కూడా ప్రవేశపెట్టారు.