ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇటీవలే యూనిఫామ్ సివిల్ కోడ్ ను అమలులోకి తీసుకొచ్చింది. దీనిపై ఒక్కొక్కరు ఒక్కోరకంగా స్పందిస్తున్నారు. ఇదే క్రమంలో బాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ నటుడు చేసిన ప్రకటన తీవ్ర దుమారం రేపుతోంది. ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు శత్రుఘ్న సిన్హా ఇటీవల తరచూ వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఆయన చేస్తున్న కామెంట్స్ తీవ్ర వివాదానికి దారి తీస్తున్నాయి. ఈ క్రమంలోనే త్రుఘ్న సిన్హా ఉత్తరాఖండ్‌లో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు గురించి మాట్లాడారు. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా మాంసాహార ఆహారాన్ని నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో ఆయన తీవ్ర విమర్శల పాలవుతున్నారు. ‘యూనిఫాం సివిల్ కోడ్‌లో కొన్ని లొసుగులు ఉన్నాయి. యూసీసీ నిబంధనలను రూపొందించే ముందు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి. ఇక ఉత్తరాఖండ్‌లో ప్రాథమిక స్థాయిలో UCC అమలు చేసినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలనేది నా డిమాండ్. అలాగే దేశంలో గొడ్డు మాంసం మాత్రమే కాదు, అన్ని రకాల మాంసం వినియోగాన్ని నిషేధించాలి. ఉత్తర భారతదేశంలో అమలు చేస్తోన్న నియమాలను ఈశాన్య రాష్ట్రాల్లో విధించలేం’ అని శత్రుఘ్న సిన్హా వ్యాఖ్యానించారు.
శతృఘ్న ప్రకటన చర్చకు దారి తీసింది. ‘UCC లో ఏ ఆహారాలు తినాలో, ఏవి తినకూడదో చెబుతారా?’ అని కొందరు నెటిజన్లు నటుడిని విమర్శిస్తున్నారు. ‘యూసీసీ ఆహార అలవాట్ల గురించి కాదు.’ ఇది వివాహం, ఆస్తి హక్కుల గురించిన చట్టం’ అని మరికొందరు నటుడికి సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
శత్రుఘ్న సిన్హా కాంట్రవర్సీ కామెంట్స్.. వీడియో ఇదిగో..
“Implementation of UCC successful Uttarakhand, is prima facie, COMMENDABLE. UCC indispensable beryllium determination successful the country. NON-VEGETARIAN nutrient successful general, indispensable beryllium BANNED successful the country.”
~ Liberals would beryllium tempted to benignant SANGHI successful reply but Shatrughan Sinha is simply a TMC MP😂🔥pic.twitter.com/PNR8JUM8fN
— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) February 5, 2025
అంతకుముందు, శత్రుఘ్న సిన్హా కుమార్తె సోనాక్షి సిన్హా జహీర్ ఇక్బాల్‌ను వివాహం చేసుకున్నప్పుడు చాలా చర్చ జరిగింది. ఈ వివాహానికి శతృఘ్న అంగీకరించలేదని పుకార్లు వచ్చాయి. ఈ విషయంపై తనను విమర్శించిన వారిపై శత్రుఘ్న సిన్హా విరుచుకుపడ్డారు. ఇక ఇటీవల సైఫ్- కరీనాల ఏఐ ఫొటోలను షేర్ చేసి కూడా విమర్శల బారిన పడ్డారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.