కుమారి 21 ఎఫ్ సినిమా తర్వాత చాలా మంది హెబ్బా పటేల్ కోసం గూగుల్ ను గాలించారు. ఈ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది ఈ చిన్నది. కానీ అంతగా సక్సెస్ కాలేకపోయింది. కేవలం గ్లామరే కాదు డీ గ్లామర్ రోల్ కూడా చేస్తానని ఓదెల మూవీతో నిరూపించింది. ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ గా చేసింది. అయినా కూడా అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.
Updated on: Feb 12, 2025 | 2:28 PM
అలా ఎలా అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన హెబ్బా పటేల్ తన నటనతో ఆకట్టుకుంది. ఆతర్వాత వచ్చిన కుమారి 21 ఎఫ్ సినిమా ఈ అమ్మడి క్రేజ్ ను పెంచేసింది. కుమారి 21 ఎఫ్ సినిమా తర్వాత చాలా మంది హెబ్బా పటేల్ కోసం గూగుల్ ను గాలించారు.
1 / 5
ఈ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది ఈ చిన్నది. కానీ అంతగా సక్సెస్ కాలేకపోయింది. కేవలం గ్లామరే కాదు డీ గ్లామర్ రోల్ కూడా చేస్తానని ఓదెల మూవీతో నిరూపించింది. ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ గా చేసింది. అయినా కూడా అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.
2 / 5
ఇక స్పెషల్ సాంగ్స్ లోనూ మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. అందంలో మంచి మార్కులు కొట్టేసిన ఈ అమ్మడు మంచి సినిమా పడితే తన టాలెంట్ ను నిరూపించుకోవాలని ఎదురుచూస్తుంది. కానీ ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోతుంది.
3 / 5
ఇక సోషల్ మీడియాలో హెబ్బా పటేల్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ మధ్య అందాల ఆరబోతతో అదరగొడుతోంది. క్రేజీ ఫోటోలను షేర్ చేస్తూ వావ్ అనిపిస్తుంది. నిత్యం హెబ్బా పటేల్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంటాయి.
4 / 5
ఇక హెబ్బా పటేల్ షేర్ చేసే ఫోటోలకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. ఓ వైపు చీరకట్టులో కవ్విస్తూనే మరో వైపు గ్లామరస్ ఫొటోలతో ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ చీర కట్టిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
5 / 5