ప్రపంచంలో అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరొందిన ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. రోజుకు కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. సామాన్యులతో పాటు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు కూడా ఈ ఆధ్యాత్మిక వేడుకలో భాగమవుతున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు మహా కుంభమేళాలో పాల్గొంటున్నారు. ఇప్పటికే సంయుక్త మేనన్, యాంకర్ లాస్య, బింధుమాధవి, శ్రీనిధి శెట్టి, పూనం పాండే, పవిత్ర గౌడ తదితర సినీ ప్రముఖులు కుంభమేళాలో తళుక్కుమన్నారు. తాజాగా బిగ్ బాస్ తెలుగు ఫేం ప్రియాంక జైన్ మహా కుంభమేళాలో తళుక్కుమంది. తన ప్రియుడు, బుల్లితెర నటుడు శివ కుమార్ తో కలిసి ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో పాల్గొంది. పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించింది. అనంతరం తన కుంభమేళాకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. దీంతో కొద్ది క్షణాల్లోనే వైరల్ గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లలో చాలామంది పాజిటివ్ గానే స్పందించారు. అదే సమయంలో మరికొందరు నెగెటివ్ కామెంట్స్ చేశారు. ‘దేవుడి దగ్గర కూడా ఫోటో షూట్స్, రీల్స్ అవసరమా? మీరు వెళ్లింది భక్తి కోసమా లేక ఇన్ స్టా స్టోరీల కోసమా? భక్తి శ్రద్ధలతో చేయాల్సిన పూజలని ఫొటోలు కోసం, వ్లాగ్స్ కోసం చేస్తారా? అంటూ విమర్శలు చేశారు.
కాగా గత కొద్ది రోజుల నుంచి ఆధ్యాత్మిక యాత్రలతో బిజీ బిజీగా ఉంటోంది ప్రియాంక జైన్. తన ప్రియుడితో కలిసి పలు ఆధ్యాత్మిక క్షేత్రాలు, దేవాలయాలను దర్శించుకుంటోంది. ఇక మహా కుంభమేళా తర్వాత కాశీలో ప్రత్యక్ష మైందీ బిగ్ బాస్ బ్యూటీ. వీటికి సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది ప్రియాంక జైన్.
ఇవి కూడా చదవండి
‘దేవుడి దగ్గర కూడా అదే పనా?’
తిరుమల ప్రాంక్ వీడియోతో నెగెటివిటీ
కాగా ప్రియాంక జైన్ పై నెగెటివిటీ పెరగడానికి కారణం ఆమె తిరుమల పర్యటన. అలిపిరి నడక మార్గం ద్వారా కొండపైకి వెళ్లే క్రమంలో ఏడో మైలురాయి వద్ద చిరుతపులి కనిపించింటూ ప్రియాంక, శివ కలిసి ఒక ప్రాంక్ వీడియో తీయడం విమర్శలకు దారి తీసింది.
కాశీలో ప్రియాంక జైన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.