వీడియోతో పాటుగా ఆమె ఈ సంఘటన తనకు అసహ్యం కలిగించిందంటూ క్యాప్షన్‌లో రాశారు. రోజూ తన బట్టలు ఇలా ఎలా, ఎందుకు మాయమవుతున్నాయో తనకు ఏమాత్రం అర్థంకాలేదని చెప్పింది. విసుగెత్తి పోయిన ఆమె చివరకు తమ ఇంటి ఆవరణలో సీసీటీవీ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. సీసీటీవీ ఏర్పాటుతో కారిడార్‌లో ఒక వ్యక్తి తిరుగుతూ కనిపించాడు. అతడు ఏం చేస్తున్నాడో కూడా మొత్తం కెమెరాలో రికార్డైంది.
Man stealing women undergarments
Updated on: Feb 06, 2025 | 1:49 PM
సోషల్ మీడియాలో చిత్ర విచిత్రమైన వార్తలు వైరల్ అవుతుంటాయి. అలాంటిదే తాజాగా మరో వింత వార్త వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి గ్యాలరీలో ఆరేసిన మహిళల దుస్తులను దొంగిలిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వ్యక్తి చాలా రోజులుగా ఆడవాళ్ల బట్టలు దొంగిలిస్తున్నాడు. తరచూ బట్టలు మాయం కావడం గమనించిన ఆ మహిళ అతన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి ఆమె ఒక పథకం వేసింది. ఆమె వేసిన పథకంలో అడ్డంగా వచ్చి బుక్కయ్యాడు సదరు దొంగోడు. యదావిధిగా అతడు ఆమె లోదుస్తులను దొంగిలిస్తూ పట్టుబడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
సింగపూర్‌కు చెందిన ఫేస్‌బుక్ యూజర్ ఆల్వీ లిమ్ ఈ వీడియోను షేర్ చేశారు. ఈ సంఘటన తనకు అసహ్యం కలిగించిందంటూ క్యాప్షన్‌లో రాశారు. రోజూ తన లోదుస్తులు ఎలా, ఎందుకు మాయమవుతున్నాయో తనకు ఏమాత్రం అర్థంకాలేదని చెప్పింది. విసుగెత్తి పోయిన ఆమె చివరకు తమ ఇంటి ఆవరణలో సీసీటీవీ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. సీసీటీవీ ఏర్పాటుతో కారిడార్‌లో ఒక వ్యక్తి తిరుగుతూ కనిపించాడు. అతడు ఏం చేస్తున్నాడో కూడా మొత్తం కెమెరాలో రికార్డైంది.
ఇవి కూడా చదవండి
ఆ వ్యక్తి ఆమె బట్టల దగ్గర ఆగి ఆమె లోదుస్తులను దొంగిలించి తన ప్యాంటులో దాచుకోవటం వీడియోలో కనిపిస్తుంది. మరొక వీడియోలో ఒక వ్యక్తి లోదుస్తులను దొంగిలించడానికి బట్టల దగ్గర నిలబడి ఉండటం కనిపిస్తుంది. ఓసారి అతను ఆరేసిన లోదుస్తులు తీసుకునే క్రమంలోనే అతని దృష్టి కెమెరాపై పడింది. వెంటనే అలర్ట్ అయ్యాడు.. అతను వాటిని తన ప్యాంటు నుండి పక్కన పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్‌నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది.
వీడియో ఇక్కడ చూడండి..
సదరు వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ ప్రాంతమంతా కలకలం రేగింది. ఇది చూసిన ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా అతన్ని పట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. చివరికి ప్రజల కృషి ఫలించింది. పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా తెలిసింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..