బత్తుల ప్రభాకర్‌ది ఏపీలోని చిత్తూరు జిల్లా.. 2013 నుండి చోరీలు ప్రారంభించిన ప్రభాకర్.. ఇప్పటివరకు ఏడుసార్లు జైలుకు వెళ్లొచ్చాడు. 2022 మార్చిలో విశాఖ జైలు నుంచి పరారైన అతనిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లో మొత్తం 80 చోరీలు చేశాడు.. కేవలం 11 చోరీల్లోనే రెండున్నర కోట్లు కొట్టేశాడు. కానీ పోలీసులకు కేవలం 62వేలు మాత్రమే దొరికిందంటే ప్రభాకర్ ఎంతటి లగ్జరీ లైఫ్ గడుపుతున్నాడో అర్థం చేసుకోవచ్చు..
ముఖ్యంగా ప్రభాకర్ తన జీవితంలో రెండు టార్గెట్లు పెట్టుకున్నాడు.. ఒకటి రూ.3 కోట్లు చోరీ చేయడం.. రెండోది 100మంది యువతులతో స్నేహం చేయాలనేదే అతడి టార్గెట్.. ప్రభాకర్ చెస్ట్ మీద రెండు వైపులా పచ్చ బొట్లు వేయించుకున్నాడు. మూడేళ్లుగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు. చివరికి సాహసోపేతంగా అతని ఆటకట్టించారు.
అయితే, ప్రభాకర్ క్రిమినల్ హిస్టరీ, లైఫ్ స్టైల్ చూసి పోలీసులుసైతం ఆశ్చర్యపోతున్నారు. కేసు విచారణలో బత్తుల ప్రభాకర్ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభాకర్ చోరీలు చేసేందుకు ప్రత్యేకంగా వారంలో ఓ రోజును ఫిక్స్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారంలో తొలి 3 రోజులు ప్లానింగ్ చేసి.. గురువారం మాత్రమే చోరీలకు పాల్పడతాడు. ఆ తర్వాత వీకెండ్స్‌లో జల్సాలు చేస్తాడని పోలీసులు చెబుతున్నారు. కనీసం రూ.10 లక్షలు దొరుకుతాయనుకుంటే రంగంలోకి దిగుతాడట బాబు. ఎవ్వరికీ అనుమానం రాకుండా ప్రముఖ కాలేజీలు, విద్యా సంస్థల్లో మాత్రమే చోరీలు చేస్తాడని డీసీపీ నరసింహ చెబుతున్నారు.
ఇక ఓసారి జైలులో తోటి ఖైదీలో గొడవ జరగ్గా.. ప్రతీకారంతో అతడిని చంపేందుకు బిహార్ వెళ్లి కంట్రిమేడ్ గన్స్ మూడింటిని, 500 బుల్లెట్లు సైతం కొనుగోలు చేశాడు. వాటి కోసం రూ.10 లక్షలు ఖర్చు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రభాకర్ తెలివితేటలు చూసి పోలీసుల సైతం ఆశ్చర్యపోతున్నారు.
ఖరీదైన ప్రాంతాల్లో నివాసముండే.. బత్తుల ప్రభాకర్.. బ్రాండెడ్ దుస్తులు మాత్రమే వేసుకునేవాడు. బ్రాండెడ్ విదేశీ మద్యం తాగుతూ దర్పం ప్రదర్శించేవాడు. చోరీ చేసిన సొమ్ములతో లగ్జరీ కార్లు కొనేవాడు. ఏమాత్రం అనుమానం రాకుండా వాటిని తన స్నేహితుల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించేవాడు. ఎప్పుడు డబ్బులు అవసరమైనా, ఆన్‌లైన్ లావాదేవీలు చేయాలన్నా స్నేహితుల బ్యాంకు ఖాతాలు మాత్రమే వినియోగించేవాడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.