పెళ్లంటే... ఆ సందడే వేరు. చుట్టాలు, పక్కాలు, బంధుమిత్రులతో ఇల్లు కళకళలాడుతుంది. ఇక పెళ్లిలో హైలైట్ డాన్స్.. సంగీత్ పేరుతో పెళ్లికి ముందు రోజు రాత్రి ధూంధాంగా వధూవరులతో సహా అందరూ డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తారు. వివాహం అనంతరం బారాత్ పేరుతో బంధుమిత్రులంతా వధూవరులను ఊరేగిస్తూ డాన్సలు చేస్తారు. అయితే ఇక్కడ ఓ వరుడు సంగీత్ మూడ్‌లోంచి ఇంకా బయటకు రాలేనట్టుంది. పెళ్లివేదికపైన కూడా డాన్సు ఇరగదీశాడు.
Marriage
పెళ్లంటే… ఆ సందడే వేరు. చుట్టాలు, పక్కాలు, బంధుమిత్రులతో ఇల్లు కళకళలాడుతుంది. ఇక పెళ్లిలో హైలైట్ డాన్స్.. సంగీత్ పేరుతో పెళ్లికి ముందు రోజు రాత్రి ధూంధాంగా వధూవరులతో సహా అందరూ డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తారు. వివాహం అనంతరం బారాత్ పేరుతో బంధుమిత్రులంతా వధూవరులను ఊరేగిస్తూ డాన్సలు చేస్తారు. అయితే ఇక్కడ ఓ వరుడు సంగీత్ మూడ్‌లోంచి ఇంకా బయటకు రాలేనట్టుంది. పెళ్లివేదికపైన కూడా డాన్సు ఇరగదీశాడు. దాంతో వధువు తండ్రికి చిర్రెత్తింది. వెంటనే పెళ్లి క్యాన్సిల్ చేసాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పెళ్లిలో అందరూ సరదాగా డ్యాన్స్ చేయడం మామూలే.. హుషారైన పాట వినిపిస్తే డ్యాన్స్ రానివాళ్లు కాలు కదుపుతారు. ఇక వధూవరుల స్నేహితులు ఉంటే ఆ హంగామా మామూలుగా ఉండదు. వధూవరులతో కూడా డాన్స్ చేయించాలని స్నేహితులు ప్రయత్నిస్తుంటారు. ఢిల్లీలోని ఓ వివాహ వేడుకలోనూ అదే జరిగింది. స్నేహితులు పిలవడంతో పెళ్లికొడుకు వేదికపైనుంచి లేచి వెళ్లి వారితో కలిసి డాన్స్ చేశాడు. పాపం అదే అతనిపొరపాటైపోయింది. దెబ్బకు పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. ఇదేంటి డాన్స్ చేస్తే పెళ్లి క్యాన్సిల్ చేసేస్తారా అనుకుంటున్నారా? అవును మరి ప్రతిదానికీ ఓ సమయం, సందర్భం ఉంటుంది కదా… అదే అనుకున్నట్టున్నాడు వధువు తండ్రికూడా. బాలీవుడ్ లో ఒకప్పుడు ఉర్రూతలూగించిన ‘ఛోళీకే పీఛే క్యాహై..’ పాటకు పెళ్లికొడుకు డ్యాన్స్ చేయడం చూసి అతిథులు నవ్వుకున్నారు. సరదాగా సాగిన ఈ సన్నివేశం వధువు తండ్రికి మాత్రం చిరాకు తెప్పించింది.
వరుడి డాన్స్ చూసి ఆగ్రహించిన వధువు తండ్రి ‘ఛీ ఛీ.. ఆ పాటేంటి, నీ డ్యాన్స్ ఏంటి’ అని మండిపడుతూ పెళ్లిని రద్దు చేశాడు. ఇలా రోడ్డు మీద డాన్సులు చేసే వ్యక్తికి తన కూతురును ఇచ్చి పెళ్లి చేయలేనని తేల్చిచెప్పాడు. ఆ తర్వాత ఎవరు ఎంతగా చెప్పినా ఆయన వినిపించుకోలేదు. తండ్రి నిర్ణయంతో చేసేదేంలేక వధువు కన్నీళ్లతో వేదిక దిగిపోయింది. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఈ సంఘటనకు సంబంధించిన పేపర్ క్లిప్పింగ్ ను షేర్ చేస్తూ.. వధువు తండ్రి చేసింది కరెక్టే, పెళ్లి రద్దు చేయకుంటే రోజూ ఆ డ్యాన్స్ చూడాల్సి వచ్చేదని కొందరు అంటే.. కొందరుమాత్రం పెళ్లికొడుకును సమర్ధిస్తూ కామెంట్లు చేశారు. ఇంతకూ ఈ ఘటన ఢిల్లీలో జరిగింది.