ఇండస్ట్రీలో కొత్త ముద్దుగుమ్మల సందడి కనిపిస్తుంది. రీసెంట్‌గా వచ్చిన అందాల భామలు వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ ఛాన్స్ లు అందుకుంటూ పాన్ ఇండియా హీరోయిన్స్ గా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. మరికొంతమంది భామలు ఇప్పటికీ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే చేసిన సినిమాలు కూడా ఫ్లాప్ అవుతున్నాయి. ఈ హీరోయిన్ పరిస్థితి కూడా అంతే.. చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతూ వచ్చాయి .. దాంతో ఛాన్స్ లు అందుకోవడంలోనూ వెనకబడింది ఈ అమ్మడు మొత్తానికి ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఛాన్స్ లు అందుకుంటుంది. అంతే కాదు ఓ ఫ్లాప్ సినిమాతో ఓ స్టార్ హీరోతో సినిమా చేసే ఛాన్స్ అందుకుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?
ఇది కూడా చదవండి : క్రికెటర్‌తో ఎఫైర్.. ఫ్రెండ్ భర్తతో ఆ యవ్వారం.. పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్.. ఎవరో తెలుసా.?
ఓ సూపర్ హిట్ సినిమా వస్తే.. హీరో, హీరోయిన్స్ కు ఆఫర్స్ క్యూ కట్టడం మనం చూస్తూనే ఉంటాం. ఒక్క సినిమాతో హిట్ అందుకొని నాలుగు ఐదు సినిమాలను లైనప్ చేస్తున్నారు. కాగా ఇప్పుడు ఓ హీరోయిన్ డిజాస్టర్ సినిమాతో స్టార్ హీరోలో ఛాన్స్ అందుకుంది. ఈ విషయాన్నీ ఆమె స్వయంగా చెప్పింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే. ఒకప్పుడు టాలీవుడ్ ను ఏలింది పూజాహెగ్డే. ప్రస్తుతం వరుస ఆఫర్స్ అందుకుంటుంది.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి :ఆ హీరో ఎందుకూ పనికిరాడని వాళ్ల నాన్న తెగ బాధపడ్డాడు.. ఇంతకీ అతను ఎవరంటే
పూజా హెగ్డే నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. తెలుగు, తమిళ్, హిందీ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రీసెంట్ గా బాలీవుడ్ లో దేవా అనే సినిమా చేసింది. ఈ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ సినిమా తర్వాత ఇప్పుడు సూర్య సినిమాలో ఛాన్స్ అందుకున్నది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న సినిమా రెట్రో.. ఈ సినిమాలో పూజకు ఛాన్స్ ఎలా వచ్చిందో తెలిపింది. ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ సినిమా చూసి తనను సూర్య సినిమాలో సెలక్ట్ చేశారని తెలిపింది పూజా. రాధేశ్యామ్ సినిమాలో ఎమోషనల్ సీన్స్ లో నా నటన చూసి దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాకు సెలక్ట్ చేశారు. సూర్య రెట్రో సినిమాలోనూ ఎమోషనల్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి అని తెలిపింది పూజా. ఇలా ఓ ఫ్లాప్ సినిమా పుణ్యమా అని సూర్య సినిమాలో ఛాన్స్ అందుకుంది పూజా హెగ్డే.
పూజా హెగ్డే ఇన్ స్టా..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి