హైదరాబాద్ గచ్చిబౌలి కాల్పుల కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిందితుడు ప్రభాకర్ గదిలో మూడో గన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ప్రభాకర్ నుంచి 460 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. బిహార్ నుంచి గన్స్ కొనుగోలు చేసినట్టు గుర్తించారు. సాఫ్ట్‌వేర్ స్నేహితుడి రూమ్‌లో ఉంటున్నాడు ప్రభాకర్.
Gachibouli Fire
హైదరాబాద్ గచ్చిబౌలి కాల్పుల కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిందితుడు ప్రభాకర్ గదిలో మూడో గన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ప్రభాకర్ నుంచి 460 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. బిహార్ నుంచి గన్స్ కొనుగోలు చేసినట్టు గుర్తించారు. సాఫ్ట్‌వేర్ స్నేహితుడి రూమ్‌లో ఉంటున్నాడు ప్రభాకర్. ఓ కేసులో గతంలో విశాఖ జైలుకు వెళ్లొచ్చాడు. చిత్రహింసలు పెట్టిన తోటి ఖైదీని చంపేందుకు స్కెచ్ వేశాడు.
ప్రిజం పబ్ దగ్గర కాల్పులకు తెగబడ్డ ఘరానా దొంగ ప్రభాకర్‌ను పోలీసులు కాసేపట్లో రిమాండ్‌కు తరలించనున్నారు. 80 కేసుల్లో నిందితుడిగా ఉన్న ప్రభాకర్ శనివారం సాయంత్రం ప్రిజమ్ పబ్ దగ్గర కాల్పులకు తెగబడ్డాడు. కాలేజీ హాస్టల్స్ టార్గెట్ చేసుకుని చోరీలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కొట్టేసిన సొత్తును మార్కెట్‌లో అమ్మేసి.. ఆ డబ్బుతో ప్రభాకర్ జల్సాలు చేస్తున్నాడని పోలీసులు చెప్తున్నారు. పబ్‌లోకి ఎంట్రీకి ముందే ఫుల్లుగా తాగి వచ్చిన ప్రభాకర్ పోలీసులపై కాల్పులు జరిపాడని చెప్పారు.