సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరోలలో అర్జున్ ఒకరు. యాక్షన్ కింగ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో.. కన్నడ, తెలుగులో పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. ముఖ్యంగా తెలుగులో ఈ హీరోకు మంచి ఫాలోయింగ్ ఉంది. డైరెక్టర్ శంకర్, అర్జున్ సర్జా కాంబోలో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి. అందులో జెంటిల్ మెన్, ఒకే ఒక్కడు చిత్రాలకు ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలాగే తెలుగులో నితిన్ నటించిన శ్రీఆంజనేయం సినిమాలో హనుమంతుడి పాత్రలో కనిపించారు. ప్రస్తుతం హీరోగా కాకుండా విలన్, సహాయ నటుడిగా అలరిస్తున్నారు. తాజాగా ఈరోజు విడుదలైన అజిత్ విడాముయార్చి సినిమాలో విలన్ పాత్రలో కనిపించాడు అర్జున్.
ఇదిలా ఉంటే.. అర్జున్ పెద్ద కూతురు ఐశ్వర్య ఇప్పటికే హీరోయిన్ గా మారిన సంగతి తెలిసిందే. కన్నడలో పలు సినిమాల్లో నటించి మెప్పించింది. అందం, అభినయంతో మంచి మార్కులు కొట్టేసిన ఐశ్వర్య.. కథానాయికగా సరైన బ్రేక్ మాత్రం అందుకోలేదు. హీరో విశాల్ సరసన పట్టతు యానై సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తమిళం, కన్నడ భాషలలో పలు సినిమాల్లో నటించింది. ఇక గతేడాది కన్నడ నటుడు తంబీ రాయయ్య తనయుడు ఉమాపతి రామయ్యను వివాహం చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది.
ఇవి కూడా చదవండి
ఇక అర్జున్ చిన్న కూతురు గురించి జనాలకు అంతగా తెలియదు. ఆమె పేరు అంజనా అర్జున్. తండ్రిలాగా సినీరంగంలోకి కాకుండా వ్యాపారవేత్తగా మారింది. పారిశ్రామికవేత్తగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. హైదరాబాద్ లో హ్యాండ్ బ్యాగ్స్ తయారీ యూనిట్ స్టార్ట్ చేసింది. అయితే అందరిలా కాకుండా హ్యాండ్ బ్యాగ్స్ తయారీలోనూ ప్రత్యేకత చాటుకుంది. పండ్ల తొక్కలను ఉపయోగించి హ్యాండ్ బ్యాగ్స్ తయారు చేస్తూ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకుంది. ఈ పద్దతిని ప్రపంచంలో ఇదివరకూ ఎవరు ప్రయత్నించలేదు. అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన