తెలుగు సినీపరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది పూజా హెగ్డే. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. కొన్నాళ్లుగా వరుస డిజాస్టర్స్ అందుకుంది. దీంతో నెమ్మదిగా ఆమె క్రేజ్ తగ్గిపోయింది. అదే సమయంలో పూజా సైతం తనవరకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వదిలేసుకుంది. కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. తెలుగు, హిందీ, తమిళం భాషలలో ఏ ఒక్క సినిమా చేయకుండా ఇండస్ట్రీలో యాక్టివ్ గా లేదు. అయితే చాలా కాలం తర్వాత పూజా హెగ్డే నటిస్తోన్న సినిమా దేవా. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా జనవరి 31న అడియన్స్ ముందుకు వచ్చింది. ఇందులో షాహిద్, పూజా కెమిస్ట్రీ ప్రేక్షకులను ఫిదా చేసింది.
ఇదిలా ఉంటే.. తాజాగా షాహిద్ కపూర్ తో కలిసి పూజా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ క్రమంలోనే విలేకరి తీరుపై పూజా అసహనం వ్యక్తం చేసింది. బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, హృతిక్, రణవీర్ సింగ్, షాహిద్ కపూర్ వంటి స్టార్ హీరోల చిత్రాల్లో నటించడాన్ని అదృష్టంగా భావిస్తారా ? ఆ సినిమాలకు మీరు అర్హులేనని భావిస్తున్నారా ? అని విలేకరి అడగ్గా.. పూజా స్పందిస్తూ.. “నన్ను ఆ సినిమాలకు ఎంచుకోవడానికి దర్శకనిర్మాతలకు కొన్ని కారణాలు ఉంటాయి. అవకాశం వచ్చినప్పుడు పాత్రకు తగిన న్యాయం చేయాలి. అదే నేను చేశాను. దానిని అదృష్టం అనుకుంటే అనుకోండి. నేను బాధపడను” అంటూ చెప్పుకొచ్చింది.
ఆ తర్వాత విలేకరి మళ్లీ మాట్లాడుతూ.. మీరు సినిమాలు ఎలా ఎంచుకుంటారు.. ? స్టార్ హీరోల సినిమాలైతేనే చేస్తారా ? అని అడగ్గా.. పూజా హెగ్డే సహనం కోల్పోయింది. అసలు మీ సమస్య ఏంటీ.. ? ఏం సమాధానం కావాలని కోరుకుంటున్నారు ? అంటూ ఫైర్ అయ్యింది. దీంతో షాహిద్ కపూర్ కలగజేసుకోని మ్యాటర్ డైవర్ట్ చేశాడు.
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన