బిగ్ బాస్ ఫేమ్ ఆర్ జే శేఖర్ బాషా పై మరో కేసు నమోదైంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ అతనిపై నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు శేఖర్ బాషాపై కేసు నమోదు చేశారు. కొన్ని నెలల ముందు స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై శ్రేష్టి వర్మ ఫిర్యాదు చేసింది.
Shekar Basha, Shrasti Verma
డ్రగ్స్ కేసులో తనను ఇరికించేందుకు ప్రయత్నించాడంటూ లావణ్య బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ బాషాపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఆడియో ఆధారాలను పోలీసులకు ఆమె అందజేసింది. దీంతో పోలీసులు శేఖర్ బాషాపై కేసు నమోదు చేశారు. తాజాగా ఈ బిగ్ బాస్ నటుడిపై నార్సింగి పీస్ లో మరో కేసు నమోదైంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ శేఖర్ బాషా పై ఫిర్యాదు చేసింది. గతంలో ఆమె కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఫిర్యాదు చేసి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు శేఖర్ బాషా పై కూడా కేసు పెట్టింది. జానీ మాస్టర్ కేసులో విచారణ జరుగుతుండగా కాల్ రికార్డు లీక్ చేశాడని శ్రేష్టి వర్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన పరువుకు భంగం వాటిల్లేలా , కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ మాట్లాడుతున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో పోలీసులు శేఖర్ బాషాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఉద్దేశ పూర్వకంగా, దురుద్దేశం తోనే బిగ్ బాస్ నటుడు ప్రయివేటు కాల్ రికార్డ్ లు లీక్ చేశాడని పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. శేఖర్ బాషా వ్యక్తిగత మొబైల్ తోపాటు, అతనితో ఉన్న ఇతర ఎలక్ట్రానిక్ డివైజస్ లు సీజ్ చేయాలని బాధితురాలు కోరింది. దీంతో BNS యాక్ట్ సెక్షన్ 79 ,67, ఐటీ యాక్ట్ 72 కింద పోలీసులు శేఖర్ బాషా పై కేసు నమోదు చేశారు.
మస్తాన్ సాయి కేసులో దర్యాప్తు ముమ్మరం..
మరోవైపు మస్తాన్ సాయి కేసు లో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఇందులో భాగంగా మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో వీడియోస్ ని గుర్తించారు. అమ్మాయిలను ట్రాప్ చేసి డ్రగ్స్ అలవాటు చేసిన మస్తాన్ సాయి మత్తులో ఉన్న వారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడని గుర్తించారు. దీంతో మస్తాన్ సాయి, ఖాజా లను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. ఈ మేరకు ఉప్పరపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్లను దాఖలు చేశారు. మరికాసేపట్లో ఈ పిటిషన్లు విచారణకు రానున్నాయి. వారం రోజులపాటు మస్తాన్ సాయి, ఖాజా లను పోలీస్ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. అంతకు ముందు డ్రగ్స్ టెస్ట్ లోను మస్తాన్ సాయికి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో మస్తాన్ సాయి మొబైల్ సీజ్ చేసిన పోలీసులు, డ్రగ్స్ ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారన్న విషయంపై ఆరా తీయడం ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.