బాలీవుడ్ ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ ఇటీవల తరచూ వార్తల్లో నిలిచారు. ఇటీవల ఒక సంగీత కచేరీ సందర్భంగా ఆయన ఒక మహిళా అభిమానిని పెదవులపై ముద్దు పెట్టడం విమర్శలకు దారి తీసింది. సోషల్ మీడియాలో ఉదిత్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. కొందరు సినీ ప్రముఖులు కూడా ఈ స్టార్ సింగర్ తీరును తప్పు పట్టారు. తనపై వస్తోన్న విమర్శలపై స్పందించిన ముద్దు పెట్టే విషయంలో తనకు వేరే ఉద్దేశం లేదన్నారు. అభిమానులపై తనకున్న ప్రేమను తెలియజేసేందుకే అలా చేశానంటూ చెప్పుకొచ్చారు. అయినా ఉదిత్ పై విమర్శల వర్షం కురుస్తోంది. ఇప్పుడు ఈ స్టార్ సింగర్ కు సంబంధించిన మరో వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఉదిత్ నారాయణ్ వేదికపై పాడుతూ కనిపించారు. అదే సమయంలో కొందరు మహిళా అభిమానులు ఆయనతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించారు. ఉదిత్ కూడా వారికి ఎంతో ఓపికగా ఫొటోలు, సెల్ఫీలు ఇచ్చాడు. అదే సమయలో ఒక మహిళా అభిమాని చెంపపై ముద్దు పెట్టుకున్నాడు. అలాగే మరో అభిమాని పెదవులపై ముద్దు పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీంతో చాలా మంది ఉదిత్ నారాయణ్‌ను విమర్శిస్తున్నారు.
శ్రేయా ఘోషల్ ను కూడా ఇలాగే ముద్దాడి..
ఈ వీడియో చూసిన కొందరు ఉదిత్ నారాయణ తన తీరును మార్చుకోవాలని సూచిస్తున్నారు. అదే సమయంలో కొంతమంది మీమ్స్ తయారు చేసి ‘గాడ్ ఫాదర్ ఆఫ్ ఇమ్రాన్ హష్మీ’ అని క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా గతంలోనూ పలు సార్లు ఇలా తన ముద్దులతో వార్తల్లో నిలిచారు ఉదిత్. స్టార్ సింగర్స్ శ్రేయా ఘోషల్, అల్కా యాగ్నిక్ లను స్టేజ్ పైనే ముద్దు పెట్టుకుని విమర్శల పాలయ్యారీ స్టార్ సింగర్. ఇప్పుడు మళ్లీ ఇలా వార్తల్లో నిలుస్తున్నాడు.
ఇవి కూడా చదవండి
Another video of Udit Narayan pic.twitter.com/dYGWgPfUHl
— Savage SiyaRam (@SavageSiyaram) February 5, 2025
విమర్శలపై ఏమంటున్నాడంటే?
కాగా తనపై వస్తోన్న విమర్శలపై ఉదిత్ ఇలా వివరణ ఇస్తున్నాడు. ‘అభిమానులకు నేనంటే చాలా ఇష్టం. తమ ఇష్టాన్ని తెలియజేయడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కొంతమంది షేక్ హ్యాండ్ ఇస్తారు.. మరికొంతమంది ముద్దు పెట్టుకోవాలనుకుంటారు. ఇది కేవలం ఆత్మీయత, అభిమానం. నేను సమాజంలో ఎంతో మర్యాద కలిగిన వ్యక్తిని. నాకు చాలా మంచి పేరు ఉంది. మహిళా అభిమానులతో తప్పుగా ప్రవర్తించే ఉద్దేశం నాకు లేదు. కొందరు కావాలనే దీనిని వివాదం చేస్తున్నారు’ అని అన్నారు.
WTF! what is Udit Narayan doing 😱 pic.twitter.com/Rw0azu72uY
— Abhishek (@vicharabhio) January 31, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.