సినీ ప్రముఖుల ప్రేమ, పెళ్లి, విడాకుల గురించి నిత్యం ఏదోక వార్త వింటూనే ఉంటాం. ఇప్పుడు సోషల్ మీడియా ప్రపంచంలో తారల పర్సనల్ లైఫ్ గురించి అనేక రూమర్స్ చూస్తుంటాం. తాజాగా ఓ హీరోయిన్ పేరు ఇప్పుడు నెట్టింట మారుమోగుతుంది. కేవలం 16 ఏళ్లకే ఆమె స్టార్ హీరోయిన్. కానీ 18 ఏళ్లకే విడాకులు తీసుకుంది. డివోర్స్ తర్వాత ఎన్నో బాధలను అనుభవించింది.ఇప్పుడు ఇండస్ట్రీలో సెన్సెషన్ అయ్యింది. ఈ నటి 16 సంవత్సరాల వయసులో వివాహం చేసుకుంది. 17 ఏళ్ల వయసులో, ఆమె కవలల తల్లి అయ్యింది. ఆమె మరెవరో కాదు.. నటి ఊర్వశి ధోలాకియా.
ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియదు. కానీ హిందీ సినీప్రియులకు సుపరిచితమే. ఆమె ఎక్కువగా విలన్ పాత్రలతో పాపులర్ అయ్యింది. తన వ్యక్తిగత విషయాలతో నిత్యం వార్తలలో నిలుస్తుంది. విడాకుల తర్వాత ఒంటరిగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని తన ఇద్దరు కవల పిల్లల ఆలనపాలన చూసుకుంది. హౌస్‌ఫ్లైకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఆమె 16 సంవత్సరాల వయసులో వివాహం చేసుకున్నానని, తరువాత తనకు 18 సంవత్సరాల వయసులో విడాకులు తీసుకున్నానని వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
విడాకుల తర్వాత తాను ఎలా బాధపడ్డానో, దాని నుండి ఎలా బయటపడిందో సైతం వివరించింది. డివోర్స్ తర్వాత తనను తాను ప్రశాంతంగా మార్చుకోవడానికి దాదాపు నెలరోజులు గదిలోనే ఉండిపోయానని.. ఎవరితోనూ మాట్లాడాలని లేదని తెలిపింది. తన కుమారులు క్షితిజ్, సాగర్ తమ తండ్రి గురించి తెలుసుకోవడానికి ఎప్పుడూ ఆసక్తి చూపించలేదని తెలిపింది. తన మాజీ భర్త ఇప్పటికీ తన పిల్లలను కలవలేదని.. పిల్లలు ఏడాదిన్నర వయస్సు నుండి తమ తండ్రితో మాట్లాడలేదని చెప్పుకొచ్చింది.
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన